నమిత.( Namitha ) తమిళుల ఆరాధ్య దేవతగా వెలిగిపోతున్న ఈ హీరోయిన్ మొట్టమొదటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మాత్రం తెలుగు సినిమాతోనే అయితే 1980లో సూరత్లో జన్మించిన ఈ భారీ అందాల సుందరి చిన్నతనం నుంచి ఎంతో అందంగా చలాకీగా ఉండడంతో తన చుట్టూ ఉండే స్నేహితులు అలాగే కజిన్స్ ఆమె అందం గురించి ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు.
దాంతో ఆమె ఇన్స్పైర్ అయిపోయి కాస్త యుక్త వయసు రాగానే తన అందంపై కాన్సన్ట్రేషన్ చేసి ఆ తర్వాత ఆ 2018 వ సంవత్సరంలో మిస్ సూరత్ అనే అందాల పోటీలో పాల్గొంది.అక్కడ విజేతగా నెగ్గడం తో ఆమె అందంపై ఆమెకు కాన్ఫిడెన్స్ పెరిగింది.
ఆ తర్వాత 2021లో మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది.
కానీ ఆ ఏడాది మిస్ ఇండియా గా సెలీనా జెట్లీ( Miss India Celina Jaitly ) గెలవడంతో నమిత నాలుగువ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అయితే నాలుగు స్థానంలో కూడా నిలవడం ఆమెకు మంచి లక్కునే తీసుకొచ్చింది.ఆమెకు వచ్చిన అవకాశాన్ని పట్టుకునే ముంబై ట్రైన్ ఎక్కేసింది.
ముంబైలో ఓ నలుగురు అబ్బాయిలు ఉన్న రూమ్ లో షేరింగ్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది అక్కడ ముంబై వాళ్ళు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.కానీ ఒక సినిమా కోఆర్డినేటర్ను పట్టుకొని ఎలాగోలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం కోసం ప్రయత్నించింది.
అలా మొత్తంగా 2002లో సొంతం( Sontham ) అనే సినిమాలో అవకాశం సంపాదించింది.
శ్రీను వైట్ల( Srinu Vaitla ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో నమిత ఆ చిత్రం హీరో ఆర్యన్ రాజేష్ ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని తిరగడం మొదలుపెట్టడంతో శ్రీను వైట్లకి బాగా కోపం వచ్చిందట.ఒకసారి ఫారిన్ షూటింగ్లో నమిత మరియు రాజేష్( Rajesh ) క్లోజ్ గా ఉండడం చూసి శ్రీను వైట్ల విపరీతంగా ఫైర్ అయ్యాడట.
దాంతో ఇకపై శ్రీను వైట్లతో నటించే ప్రసక్తే లేదని డిసైడ్ అయిపోయిందట.సొంతం సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఆమెకు జెమిని సినిమాలో అవకాశం రావడంతో అందులో కూడా నటించింది.
ఆ సినిమా యావరేజ్ గా నడిచిన నమితకు మంచి పేరు వచ్చింది.ఆ తర్వాత ఆవిడ వెంటనే మరో రెండు తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడి నుంచి తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది నమిత.