ఎన్టీఆర్ ఏఎన్నార్ ఒకే సంవత్సరంలో రెండు సార్లు పోటీ పడ్డారు.. ఎవరిది పై చేయో తెలుసా?

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలా ఉండేవారు నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు. వీరిద్దరూ మంచి ఆప్తమిత్రులు కూడా కావడం గమనార్హం.

 Movie Conflicts Between Ntr And Anr Details, Nandamuri Taraka Ramarao, Akkineni-TeluguStop.com

తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలుగా ఎన్నో రోజుల పాటు ఏకచ్ఛత్రాధిపత్యానికి కొనసాగించారు ఇద్దరు హీరోలు.ఎంత స్టార్ హీరోలు అయినప్పటికీ ఆప్తమిత్రులు అయినప్పటికీ ఇక పోటీతత్వం వీరి మధ్య ఉండేది.

ఇండస్ట్రీ అన్న తర్వాత ఈ చిన్నపాటి పోటీతత్వం ఉండడం చాలా సహజం అన్న విషయం తెలిసిందే.ఒకవైపు ఎన్టీఆర్ జానపద పౌరాణిక సినిమాల్లో సత్తా చాటుతుంటే.

ఏఎన్నార్ సాంఘిక సినిమాలతో జోరు చూపిస్తూ హవా నడిపించేవారు.అయితే ఇలా అగ్రహీరోలతో కొనసాగుతున్న ఎన్టీఆర్ ఏఎన్నార్ సినిమాలు ఒకే ఏడాది ఏకంగా రెండు సార్లు పోటీ పడ్డారు.

ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఎన్టీఆర్ ఏఎన్నార్ నటించిన సినిమాలు ఒకేసారి విడుదల అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇద్దరు సినిమాలు ఒక్కసారి వచ్చినా రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించి నిర్మాతలకు మాత్రం కాసుల పంట పండించేవి అని చెప్పాలి.ఒకసారి మాత్రం ఒకే ఏడాదిలో రెండు సార్లు పోటీ పడ్డారు ఇద్దరు హీరోలు.1967 ఏప్రిల్ 7వ తేదీన ఎన్టీఆర్ భువనసుందరి కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే అదే రోజున ఏఎన్ఆర్ గృహలక్ష్మి అనే కుటుంబ కథ చిత్రం తో ప్రేక్షకులను పలకరించాడు.ఇక రెండు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.

ఇక ఈ పోటీలో ఎన్టీఆర్ ది పైచేయిగా నిలిచింది.భువనసుందరి మంచి విజయం సాధిస్తే ఏఎన్ఆర్ గృహ లక్ష్మి మాత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

Telugu Bhuvanasundari, Gruhalakshmi, Nandamuritaraka, Nindu Manasulu, Ntr Ant, V

ఇక 1967 సంవత్సరంలోనే మరోసారి బాక్సాఫీస్ వద్ద ఈ అగ్ర హీరోలు ఇద్దరు సినిమాలు కూడా పోటీ పడటం గమనార్హం.ఆగస్టు నెలలో ఎన్టీఆర్ నిండు మనసులు అనే సాంఘిక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే.ఏఎన్నార్ మాత్రం వసంతసేన అనే జానపద మూవీతో బాక్సాఫీస్ బరిలో దిగారు.అయితే ఎన్టీఆర్ ది పూర్తి బ్లాక్ అండ్ వైట్ సినిమా అయితే ఏఎన్ఆర్ ని మాత్రం కలర్ సినిమా కావడం గమనార్హం అయినప్పటికీ ఎన్టీఆర్ రెండో సారి కూడా పైచేయి సాధించారు.

నిండు మనసులు సినిమా సూపర్ హిట్టయ్యింది.ఏఎన్ఆర్ వసంతసేన మాత్రం ప్రేక్షకాదరణ పొందే లేకపోయింది.ఇలా ఇద్దరు హీరోల మధ్య రెండు సార్లు పోటీ జరిగితే రెండు సార్లు ఎన్టీఆర్ పైచేయి సాధించారు అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube