36 సంవత్సరాల ఒక మహిళ తన 18 ఏళ్ల కుమార్తెతో పార్టీకి వెళ్లడంపై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.దీనికి ఆ తల్లి దీటైన సమాధానం ఇచ్చింది.
తాను, తన కుమార్తె క్లబ్‌కు వెళ్లిన సందర్భంలో ఎప్పుడూ తప్పు జరగలేదని ఆమె వివరణ ఇచ్చింది.బ్రిటన్‌కు చెందిన ఆ మహిళ పేరు లారా జేనే.
ఆమె ఇటీవల తన 36 వ పుట్టినరోజును జరుపుకుంది.లారా తన పుట్టినరోజు పార్టీని మాంచెస్టర్ నైట్ క్లబ్‌లో నిర్వహించింది.
దీనికి ఆమె కుమార్తె లెవి-యాష్లీ వారి సన్నిహితులు హాజరయ్యారు.అయితే లారా ఈ పార్టీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు నెటిజన్లు ఆమెను ఎగతాళి చేశారు.
కొంతమంది నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించారు.నైట్‌క్లబ్‌లో కుమార్తెతో తాగడాన్ని, నృత్యం చేయడాన్ని నెటిజన్లు తప్పుబట్టారు.
ఒక యూజర్ ఆమెను ఉద్దేశించి… ఆమె తన వయసును కుమార్తెను గుర్తించాలన్నారు.మరొక యూజర్ ప్రతి వారాంతంలో కుమార్తెతో ఇలాంటి పార్టీలకు వెళ్లడం సరైనది కాదని అన్నారు.
ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఆమె ఇలా చేస్తున్నదని కొందరు విమర్శించారు.సోషల్ మీడియాలో యూజర్స్ చేస్తున్న ఈ వ్యాఖ్యలకు లారా స్పందించారు.
తాను.తన కుమార్తె ఒకరికొకరు రక్షకులుగా ఉంటామన్నారు.
తాము ఇద్దరం నైట్‌క్లబ్ లేదా పబ్‌కు వెళ్లినప్పుడు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటామన్నారు.తాము పార్టీలకు వెళ్లినప్పుడు ఎప్పుడూ తప్పు జరగలేదని లారా తెలిపింది.కాగా కొంతమంది యూజర్స్ లారా రూపాన్ని ఎంతగానో ప్రశంసించారు.ఒక వినియోగదారు ఆమె తన కుమార్తెలాగా కనిపిస్తుందని పేర్కొన్నారు.
మరొకరు ఆమె వ్యక్తిత్వం చాలా బాగుందని మెచ్చుకున్నారు.