దక్షిణ కాశీగా పిలువబడుతున్న నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో అపచారం జరిగింది.ఆలయ ఈవోనే ఈ అపచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఆలయ పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం నిర్వహిస్తున్న సమయంలో అక్కడే ఈవో వేణు జలకాలాట ఆడారు.పుష్కరిణిలో ఈత కొట్టద్దని అర్చకులు వారిస్తున్న ఈవో వినిపించుకోలేదు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలో ఈవో తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న భక్తులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.