మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ రిలీజ్

మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అలభిస్తుంటుంది.సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి.

 Minister Talasani Srinivas Yadav Launched Theatrical Trailer Of Unique Crime Thr-TeluguStop.com

అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కించి కిరోసిన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధృవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు.

ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా సేవలందిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్.చిన్న సినిమాలకు బెస్ట్ సపోర్ట్ ఇస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా కిరోసిన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని కితాబిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ పృద్వీ యాదవ్, దీప్తి కొండవీటి, కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, వెంకన్న ముదిరాజ్, హేమంత్ యాదవ్, సురేంద్ర, స్వాతి తదితరులు పాల్గొన్నారు.రెండు నిమిషాల 14 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో చూపించిన ప్రతి సన్నివేశం సినిమాపై హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు.

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలు జోడించి ఈ సినిమాను రూపొందించారని స్పష్టమవుతోంది.చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోగా.తాజాగా విడుదల చేసిన ట్రైలర్ హైప్ పెంచేసింది.

నటీనటులు

ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య

సాంకేతిక నిపుణులు :

బ్యానర్ : బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్, నిర్మాతలు : దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్, కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ దర్శకత్వం: ధృవ పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు పర్వతనేని

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube