మత్స్యకారులు జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉచిత చేప పిల్లల పంపిణీ..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో కులవృత్తుల జీవితాల్లో వెలుగులు నిండాయి.గొల్లకుర్మలకు పూర్తి సబ్సిడీపై గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీ చేపల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నది.

 Minister Puvvada Ajay Distributes Free Fishes In Khammam Constituency, Minister-TeluguStop.com

దీంతో మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి.చేపల పెంపకం కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం కొటపాడు గ్రామంలోని మాచినేని చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

తొలుత గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆయా చేపపిల్లల నిల్వ వాహనాన్ని పరిశీలించి జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్న పరిస్థితులను మత్స్య శాఖ జిల్లా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎంపి వద్దిరాజు రవిచంద్ర గారు, జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, జిల్లా కలెక్టరు VP గౌతమ్ గారితో కలిసి చెప పిల్లలను చెరువులో వదిలారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ.

ఈ ఏడాది జిల్లాలో 1,129 చెరువులలో 3.61 కోట్ల చేప పిల్లలను పెంచడమే లక్ష్యంగా నిర్ణయించాని, చిన్న, పెద్ద పరిమాణంగల చేప పిల్లలను జిల్లాలోని చెరువుల్లో పెంచనున్నమన్నారు,

పెద్ద చేపపిల్లలు (82-100 మి.మీ), చిన్న చేపపిల్లలను(35-40 మి.మీ) జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో వదలనున్నామన్నారు.

చేపకు, చెరువుకు ఉన్న అనుబంధాన్ని తిరిగి నెలకొల్పే సదుద్దేశంతో చెరువుల్లో చేపలను పెంచేందుకు సీఎం కేసీఆర్‌ గారు నిర్ణయించిన సంగతి తెలిసిందేనని, వందశాతం సబ్సిడీతో పంపిణీ చేసిన చేపలను మత్స్యకారుల సొసైటీల ఆధ్వర్యంలో పెంచడం జరుగుతుందన్నారు.గతంలో కొన్ని చెరువుల్లో నీరు ఉండకపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరున్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నిరుత్సాహంతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొని ఉండేదని, చెరువుల్లో నీరు లేక కొందరు మత్స్యకారులు వలసలు పోగా, మరికొందరు ఇతర పనులు చేస్తుండేవారన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులు, పూర్తైన చెరువుల్లో చేపపిల్లలను పెంచే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు.

అక్రమాలకు తావు లేకుండా చేపల పెంపకం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చెరువుల విస్తీర్ణాన్ని బట్టి చేపలను పెంచుతారని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేపల పెంపకం జరుగుతున్నదన్నారు.

గ్రామ కార్యదర్శి తదితరులతో కూడిన గ్రామస్థాయిలో కమిటీలను కూడా ప్రభుత్వం నియమించిందని, జిల్లాలో 187 మత్స్యకారుల సొసైటీలుండగా.వీటిలో 14వేల మంది సభ్యులున్నారని వివరించారు.

ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో అందజేయడంతోపాటు చేపల విక్రయాల్లో మత్స్యకారులు నష్టపోకుండా కూడా చర్యలు చేపట్టిందని, జిల్లాలో పెంచిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా హైదరాబాద్‌తోపాటు స్థానికంగా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు.

చేపలను విక్రయించేందుకు 70 శాతం సబ్సిడీతో వాహనాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే మత్స్యకారులకు అందజేసిందని, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదన్నారు.

గొల్ల, కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెలను పంపిణీ చేసిన ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నదని, గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి భరోసాను కల్పించిందన్నారు.

చేపల పెంపకాన్ని వదిలి ఏదో ఒక కూలీ పని చేస్తూ బతుకునీడుస్తున్న మత్స్యకారుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్‌ తిరిగి వెలుగులు నింపారని, ఇందులో భాగంగా గత ఐదేండ్లుగా మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులు సక్సెస్‌ కావడం, చెరువుల్లో నీరు నిండుతుండడంతో చేపల పెంపకానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే అని, ఇప్పటికే నాలుగు దఫాల్లో చేపల పెంపకం పూర్తి కావడంతో సంబంధిత చేపలను విక్రయించిన మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయని పేర్కొన్నారు.

మత్స్యకారుల జీవితాల్లో నూతనోత్సాహం నింపిన సీఎం కేసీఆర్‌కు గారికి మత్స్యకారుల తరుపున వారు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube