సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రంగదాంపల్లిలో దసరా పండుగ ఉత్సవాల కార్యక్రమంలో హాజరై రావణ దహనం చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. అనంతరం నర్సాపూర్ హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత రావణ దహనం చేశారు.మంత్రి తన్నీరు హరీశ్ రావు కామెంట్స్.
విద్య, వైద్యంలో అన్ని రంగాలలో సిద్ధిపేటను అభివృద్ధిలో ముందంజలో నిలిపాం.
ఐటీ హబ్ జనవరి 1న ప్రారంభిస్తాం.1500 మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తాo.వచ్చే దసరా నాటికి సిద్ధిపేటకు రైలు వస్తది.వంద కోట్లతో రంగనాయక సాగర్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నాం.సిద్ధిపేట నియోజక వర్గం నా కుటుంబం.నా ఊపిరి ఉన్నంత వరకూ సిద్ధిపేట ప్రజలకు శక్తివంచన లేకుండా సేవ చేస్తా.