మనదేశంలో ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి.తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేరళ మైగ్రేషన్ సర్వే నిర్వహించడం ద్వారా ఎన్ఆర్ఐ డేటా బ్యాంక్‌ను విస్తరింపజేస్తామని సీఎం స్పష్టం చేశారు.శనివారం జరిగిన మూడవ ‘‘ లోక కేరళ సభ ఆన్‌లైన్’’ కార్యక్రమంలో విజయన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ప్రతినిధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.ప్రవాసుల డేటా పోర్టల్‌ను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
దీని ద్వారా గ్లోబల్ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ప్రవాసుల సమాచార సేకరణను అత్యవసర సమస్యగా పేర్కొన్న సీఎం.
ఖచ్చితమైన సమాచారం లేకపోవడం వల్ల ఎన్ఆర్ఐ సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో లోక కేరళ సభ చట్టబద్ధమైన వేదికగా మారుతుందని చెప్పిన విజయన్.
ఇకపై ప్రవాస మలయాళీ సమాజానికి, కేరళ ప్రభుత్వానికి మధ్య అంతరం ఉండబోదన్నారు.లోక కేరళ సభ సిఫారస్సులను సీరియస్‌గా తీసుకుని అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని పినరయి విజయన్ స్పష్టం చేశారు.
ప్రవాసీ కమ్యూనిటీ.కేరళలో ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం దీనికి మద్ధతు ఇస్తుందని సీఎం హామీ ఇచ్చారు.కేరళను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పినరయి విజయన్ పేర్కొన్నారు.రాబోయే 25 ఏళ్లను ఇందుకు డెడ్‌లైన్‌గా పెట్టుకున్నామని.
దీనికి సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రవాస భారతీయులను ముఖ్యమంత్రి కోరారు.
అలాగే తమ ప్రభుత్వం విద్యా రంగంలో చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా పినరయి విజయన్ ఈ సందర్భంగా వివరించారు.5 జీ నెట్‌వర్క్ సేవల రంగంలో కేరళ అగ్రగామిగా వుండేందుకు ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్రంలోని నాలుగు ఐటీ కారిడార్లలో దీనిని అమలు చేస్తామని పినరయి విజయన్ వెల్లడించారు.
ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.అలాగే రాష్ట్రంలో అత్యంత పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల డేటాను సేకరించి.వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు పినరయి విజయన్ పేర్కొన్నారు.