ఆ హీరోలో మార్పును చూసి అవాక్కయ్యానంటున్న బ్యూటీ

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం అశ్వధ్ధామ జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్ పీర్జాదా నటించింది.

 Mehreen Kaur Shocked With Naga Shourya Transformation-TeluguStop.com

అమ్మడు ఇటీవల వరుస ఫ్లాపులతో సతమతమవుతుండటంతో అశ్వధ్ధామ సినిమాపై ఆమె భారీ నమ్మకాలు పెట్టుకుంది.ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఈ సినిమాలో ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని మెహ్రీన్ తెలిపారు.ఇక ఈ సినిమా కోసం నాగశౌర్య పడ్డ కష్టం మనకు సినిమా చూస్తే తెలుస్తుందని ఆమె తెలిపింది.

ఛలో సినిమాలో నాగశౌర్య లవర్ బాయ్‌గా అలరిస్తే, ఈ సినిమాలో యాక్షన్ హీరోగా మనల్ని ఎంటర్‌టైన్ చేయడం ఖాయమని ఆమె అన్నారు.ఇక ఈ సినిమా కోసం శౌర్య తనను తాను మార్చుకున్న విధానం చూసి తాను అవాక్కయ్యానంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

మొత్తానికి అశ్వధ్ధామ సినిమాతో నాగశౌర్య మెహ్రీన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్‌కు కొదువే లేదని చిత్ర యూనిట్ తెలిపారు.

ఈ సినిమాను రమణ తేజ డైరెక్ట్ చేస్తుండగా ఉషా ముల్పూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube