సతీష్ వేగేశ్న సినిమాలో ఇద్దరు హీరోలు... తనయుడుతో పాటు శ్రీ హరి కొడుకు

రచయితగా కెరియర్ ప్రారంభించి దొంగలబండి సినిమాతో దర్శకుడుగా మారి తరువాత శతమానం భవతి సినిమాతో కుటుంబ కథా చిత్రాల దర్శకుడుగా మారిన వ్యక్తి సతీష్ వేగేశ్న.అతను దర్శకుడుగా చేసిన నాలుగు సినిమాలలో మూడు సినిమాలు ఫ్యామిలీ కథాంశంతోనే తెరకెక్కించినవే.

 Meghamsh And Sameer In Satish Vegesna Next Film, Tollywood, Telugu Cinema, Sriha-TeluguStop.com

అయితే వీటిలో శతమానం భవతి సినిమా తప్ప మరే ఇతర సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు.ఫ్యామిలీ డ్రామా మరీ శృతి మించి ఉండటంతో వాటికి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేదు.

అయితే ఐదో ప్రయత్నంగా తన కొడుకు సమీర్ ని హీరోగా పరిచయం చేస్తూ సతీష్ వేగేశ్న ఒక సినిమా ప్లాన్ చేశారు.తాజాగా శ్రీహరి జయంతి రోజున ఈ సినిమాని ప్రకటించారు.

ఈ సినిమాలో సతీష్ వేగేశ్న కొడుకుతో పాటు శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ శ్రీహరి కూడా ఒక హీరోగా నటిస్తున్నాడు.ఎమ్‌ఎల్‌వి సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు.ఈ సినిమా అఫీషియల్ ప్రకటన సందర్భంగా దర్శకుడు సతీష్‌ వేగేశ్న మాట్లాడుతూ వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేశాను.ఇప్పుడు ఓ మంచి పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా చేయబోతున్నాను.

కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్‌ మొదలు పెడతామని స్పష్టం చేశారు.మొత్తానికి తన సినిమాని అల్లరి నరేష్ తో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా సతీష్ వేగేశ్న ఆవిష్కరించారు.

మళ్ళీ ఫ్యామిలీ కథని పక్కన పెట్టి ఈ ఇద్దరు యువ హీరోలతో కామెడీ పండించడానికి రెడీ అయ్యారు.ఈ సినిమాతో దర్శకుడు ప్రేక్షకులని ఎంత వరకు మెప్పిస్తాడు అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube