మెగాస్టార్ చిరంజీవి- స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కలయికలో రూపొందుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “’భోళా శంకర్” కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది.రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది.‘మెగావైబ్ తో కొత్త షెడ్యూల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం”అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవిని మెగా స్టైలిష్ గా కనిపించి అలరించారు.ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది.
క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
సత్యానంద్ కథ పర్యవేక్షకుడిగా, తిరుపతి మామిడాల డైలాగ్ రైటర్ గా , మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.ఈ ఏడాది చివర్లో భోళా శంకర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం:
చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.
సాంకేతిక విభాగం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి సంగీతం: మహతి స్వర సాగర్, డీవోపీ: డూడ్లే, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, కథా పర్యవేక్షణ: సత్యానంద్ డైలాగ్స్: తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ, కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ, పీఆర్వో : వంశీ-శేఖర్, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్, పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను, డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సీఎం,లైన్ ప్రొడక్షన్: మెహెర్ క్రియేషన్స్
.