మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej )చాలా కాలంగా ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని( Lavanya tripathi ) పెళ్లి చేసుకోబోతున్న విషయం తెల్సిందే.కొన్ని నెలల క్రితం వీరి వివాహ నిశ్చితార్థం వైభవంగా జరిగింది.
ఆ సమయంలోనే చాలా మందికి వరుణ్ మరియు లావణ్య త్రిపాఠి లు ప్రేమలో ఉన్నారు అనే విషయం క్లారిటీ వచ్చింది.ఇద్దరు కలిసి రెండు సినిమా ల్లో నటించారు.
ఆ సినిమా ల షూటింగ్స్ సందర్భంగా ప్రేమ ఏర్పడి ఉంటుంది అనేది చాలా మంది అభిప్రాయం.ఆ విషయం పక్కకు పెడితే ఇప్పుడు వీరి పెళ్లి గురించి ఇండస్ట్రీ మొత్తం కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు.
పెళ్లి హంగామా మామూలుగా ఉండదు అన్నట్లుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.ఓ రేంజ్ లో పెళ్లి వేడుక ను ఇటలీ లో నిర్వహించబోతున్నారు.వరుణ్ తేజ్ కి మరియు లావణ్య త్రిపాఠికి ఇటలీ అంటే చాలా అభిమానం.ఆ అభిమానం కారణంగానే అక్కడ పెళ్లికి సిద్దం అవుతున్నారు అంటూ సమాచారం అందుతోంది.
మెగా ఫ్యామిలీ( Mega Family ) నుంచి ఎంత మంది ఆ వివాహానికి హాజరు అవుతారు అనే అనుమానాలు మొన్నటి వరకు ఉన్నాయి.ముఖ్యంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల పెళ్లికి వెళ్తాడా అనే అనుమానం ఉంది.
అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ఇటలీ చేరుకున్నాడు.అక్కడ కి మెగా ఫ్యామిలీ దాదాపు మొత్తం చేరుకుంది.నవంబర్ 1 న పెళ్లి జరుగబోతుంది.కనుక ఇప్పటికే రామ్ చరణ్ మరియు ఉపాసన( Ram Chran Upasana ) దంపతులు ప్రయాణంకు సిద్ధం అయ్యారట.
ఇక చిరంజీవి దంపతులు కూడా ఏ క్షణం లో అయినా ఇటలీ బయలు జేరే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.మొత్తానికి వరుణ్ తేజ్, లావణ్య ల వివాహం విదేశాల్లో జరుగుతున్నా కూడా ఫ్యామిలీ మొత్తం కూడా హాజరు అవ్వబోతున్నారు.