విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో పెరుగుతోన్న మృతుల సంఖ్య

విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.మొత్తం నాలుగు రైళ్లు ప్రమాదానికి గురి అయిన సంగతి తెలిసిందే.

 Vizianagaram District Train Accident Death Toll Is Increasing-TeluguStop.com

ఇప్పటివరకు 14 మంది చనిపోయినట్లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.ఇందులో 13 మంది మృతదేహాలను గుర్తించారు.

ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.కాగా పలాస రైలును రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది.

ఈ క్రమంలో ఒకే ట్రాక్ పై ముందున్న పలాస రైలును రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది.దీంతో ప్యాసింజర్ రైలు బోగీలు గూడ్స్ రైళ్ల బోగీలపై పడ్డాయి.

అయితే బాలేశ్వర్ ప్రమాద తరహాలోనే ఇక్కడ కూడా సిగ్నల్ సమస్యతోనే ప్రమాదం ఏర్పడిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరోవైపు సీఎం జగన్ రైలు ప్రమాదం జరిగిన ప్రమాదస్థలానికి వెళ్లనున్నారు.

అక్కడ పరిస్థితిని సమీక్షించిన అనంతరం ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు.

రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు.

మంగుళూరు – సంత్రాగాచీ ఎక్స్ ప్రెస్, బెంగళూరు – హౌరా, తిరుపతి -హౌరా ఎక్స్ ప్రెస్ ల దారిని మళ్లించారు.అదేవిధంగా సికింద్రాబాద్ -హౌరా ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ దారిని మళ్లించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube