బ్రేక్ ఫాస్ట్ లో ఇది తీసుకుంటే నీరసం మీ దరిదాపుల్లోకి కూడా రాదు!

రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్ గా ఉండాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడం ఎంత ముఖ్యమో.

 If You Take It In Breakfast You Will Be Energetic Throughout The Day Details! Br-TeluguStop.com

బ్రేక్ ఫాస్ట్ లో ఏం తీసుకుంటున్నారు అన్నది కూడా అంతే ముఖ్యం.చాలా మంది కడుపు నింపుకోవడం కోసం ఉదయం ఏది పడితే అది తినేస్తుంటారు.

దాని వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి.కానీ ఇప్పుడు చెప్పబోయే ఈజీ రెసిపీ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే నీరసం మీ దరిదాపుల్లోకి కూడా రాదు.

మరియు రోజంతా యాక్టివ్ గా, ఎన‌ర్జిటిక్ గా ఉంటారు.పైగా మ‌రెన్నో ఆరోగ్య లాభాలు సైతం లభిస్తాయి.

మరి ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా హాఫ్ యాపిల్ ను తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి.అలాగే అరకప్పు వేయించిన ఫూల్ మఖానాను తీసుకుని చిన్నచిన్న ముక్క‌లుగా కట్ చేయాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఫుల్ ముఖాన ముక్కలు, ఒక కప్పు పెరుగు వేసి బాగా కలిపి ఐదు నుంచి పది నిమిషాల పాటు వదిలేయాలి.

అనంతరం అందులో కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు, అర కప్పు దానిమ్మ గింజలు, రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసుకోవాలి.

Telugu Breakfast, Fatigue, Tips, Latest-Telugu Health

అలాగే వన్ టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు విత్తనాలు, వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు, రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్షలు, వ‌న్ టేబుల్ స్పూన్‌ వేయించిన నువ్వులు, వన్ టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు ఉప్పు వేసుకుని అన్ని కలిసేలా మిక్స్ చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ ప్రోబయోటిక్ రెసిపీ సిద్ధం అవుతుంది.దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే నీరసం, అలసట వంటివి దరిచేరకుండా ఉంటాయి.రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

అంతేకాదు, ఈ రెసిపీని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల ఎముకల బలహీనత దూరం అవుతుంది.సంతాన సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.

హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.మరియు వృద్ధాప్య ఛాయలు సైతం త్వరగా రాకుండా ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube