సీఎంవో అధికారులతో ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు.ఇందులో భాగంగా అసెంబ్లీ సమావేశాలుతో పాటు మార్చి, ఏప్రిల్ లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
ఈ క్రమంలోనే ఈనెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.ఈనెల 18న సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం, జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.
అదేవిధంగా ఈనెల 22న ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్ల పేర్లు ప్రకటించడంతో పాటు వారికి ఏప్రిల్ 10న అవార్డులు అందించనున్నారు.ఈ క్రమంలోనే ఈనెల 25 నుంచి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం, ఈనెల 31న జగనన్న వసతి దీవెన, ఏప్రిల్ 6 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలులో తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.