బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 సింహాసనాన్ని అధిష్టించి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా యూకేలో ఘనంగా వేడుకలు జరగనున్నాయి.ఇందుకు సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సంబరాల్లో భారతీయులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.జూన్ రెండు నుంచి ఐదో తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ వేడుకల్లో భారత్‌కు చెందిన శాస్త్రీయ, జానపద, సినీ నృత్యాలు వీక్షకులను అలరించనున్నాయి.ఇందుకు తగినట్లు భారతీయ డాన్సర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని మన కళాకారులు చెబుతున్నారు.మరోవైపుప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం బ్రిటన్‌లో సెలవులను కూడా ప్రకటించారు.
బకింగ్‌హామ్ ప్యాలస్‌తో పాటు లండన్‌లోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలను అందంగా ముస్తాబు చేశారు.వేడుకల్లో పాల్గొనేందుకు బ్రిటన్‌తో పాటు దేశ విదేశాల నుంచి ప్రముఖులు రాజధానికి తరలి వస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో రాచరికం అంతరించి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినప్పటికీ బ్రిటన్‌ను రాజకుటుంబమే పాలిస్తోంది.ప్రస్తుతం క్విన్ ఎలిజబెత్ 2కి 95 సంవత్సరాల వయసు.
బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం పరిపాలిస్తున్న రాణిగా ఎలిజబెత్ 2 రికార్డుల్లోకెక్కారు.
ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన నటుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
ఆరు మీటర్ల నాలుగు అంగుళాల ఎత్తున్న కేక్‌తో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన చీరతో ఆయన సిద్ధంగా వుంటారు.ఆదివారం జరగనున్న ప్లాటినం జూబ్లీ వేడుకలకు సంబంధించి దక్షిణాసియా నుంచి కామన్‌వెల్త్ థీమ్‌కు ప్రాతినిథ్యం వహించడానికి భారత సంతతికి చెందిన అజయ్ ఛభ్రా, అతని నట్‌ఖుట్‌ను ఎంపిక చేశారు.51 ఏళ్ల ఈ నటుడు 1947లో ప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌తో జరిగిన వివాహం నాటి సెంటర్‌పీస్ వెడ్డింగ్ కేక్ నుంచి ప్రేరణ పొంది కేక్‌ను రూపొందించాడు.
డెబ్బై ఏళ్ల క్రితం తొమ్మిదేళ్ల వయసున్న తన తల్లి రాణికి ఫిజీలో స్వాగతం పలికింది.అప్పటి నుంచి ఆమెతో పాటు తన కుటుంబంలోని మూడు తరాల మహిళలు లండన్‌ను తమ నివాసంగా మార్చుకున్నారని ఇండో ఫిజియన్ సంతతికి చెందిన ఛబ్రా అన్నారు.డెబ్బై సంవత్సరాల తర్వాత తన తొమ్మిదేళ్ల కుమార్తె.
ఇప్పుడు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొననుందని ఆయన పేర్కొన్నారు.వేడుకల సందర్భంగా ఆయన రూపొందించిన వెడ్డింగ్ పార్టీలో లండన్, బర్మింగ్‌హామ్, లీసెస్టర్, మాంచెస్టర్, సౌతాంప్టన్ , న్యూకాజిల్‌కు చెందిన సుమారు 250 మంది పాల్గొని, బాలీవుడ్ స్టైల్‌లో ప్రదర్శన ఇస్తారు.