మేనిఫెస్టో పై మాస్టర్ ప్లాన్ ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )ప్రస్తుతం యమ దూకుడుగా కనిపిస్తోంది.ఎన్నికలు దగ్గర పడడంతో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ పోలిటికల్ హిట్ పెంచుతోంది.

 Manifesto Pi Master Plan , Cm Kcr , Brs Party , Bjp Party , Tdp Party , Con-TeluguStop.com

ఈసారి ఎలాగైనా కే‌సి‌ఆర్ ను గద్దె దించి తాము అధికారం చేపట్టాలని చూస్తున్నారు హస్తం నేతలు.ప్రస్తుతం తొలి జాబితా అభ్యర్థులపై దృష్టి పెట్టిన టీ కాంగ్రెస్.

మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనపై కూడా తుది మెరుగులు దిద్దుతోందట.ఈసారి మేనిఫెస్టో విషయంలో పకడ్బందీగా ప్లాన్ చేస్తోందట హస్తం పార్టీ.

ఎందుకంటే కర్నాటక ఎన్నికల్లో మేనిఫెస్టోనే ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది.

Telugu Bjp, Brs, Cm Kcr, Congress, Revanth Reddy-Politics

మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు భృతి కింద ప్రతినెల రూ.3 వేలు.ఇలా చాలా హామీలనే కాంగ్రెస్ ప్రకటించింది.దాంతో ఒక్కసారిగా కన్నడ ప్రజలు హస్తం పార్టీ వైపు చూశారు.అంతే కాకుండా అటువైపు బీజేపీపై( BJP ) కొంత వ్యతిరేకత కూడా కాంగ్రెస్ విజయనికి దోహదం చేసింది.దీంతో తెలంగాణలో కూడా సెం అదే వ్యూహాన్ని అమలు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ.

ఇక్కడ కూడా కే‌సి‌ఆర్( CM kcr ) సర్కార్ లో జరుగుతున్నా అవినీతి, వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.తాము వచ్చే ఎలాంటి పనులు చేస్తామో తెలిపే మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఒక్కసారిగా బి‌ఆర్‌ఎస్ పై ఉన్న వ్యతిరేకత మేనిఫెస్టో కారణంగా తమకు అనుకూలంగా మారుతుందనేది హస్తం నేతల ప్లాన్.

Telugu Bjp, Brs, Cm Kcr, Congress, Revanth Reddy-Politics

అందుకే మేనిఫెస్టో ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.త్వరలోనే సిడబ్ల్యుసి సమావేశాలు, భహిరంగ సభలు నిర్వహించనున్నారు.ఈసారి నిర్వహించబోయే సిడబ్ల్యూసి సమావేశంలో తుది నిర్ణయం తీసుకొని ఈ నెల17 న మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఇటీవల చెప్పుకొచ్చారు.ఆ తరువాత నుంచి ప్రచారంపై ఫోకస్ పెట్టనున్నారట.

అయితే కర్నాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో సూపర్ సక్సస్ కావడంతో తెలంగాణలో కూడా సేమ్ మేనిఫెస్టో ను కాంగ్రెస్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరి హస్తం పార్టీ హామీలు ఎలా ఉంటాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube