టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు( Manchu Vishnu ) మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టు భక్తకన్నప్ప ( Bhaktakannappa )సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పర్ఫెక్ట్ ప్లాన్స్ తో ముందుకు వెళ్తున్నారు విష్ణు.అంతేకాకుండా ఈ సినిమా కోసం పాన్ ఇండియా హీరోలను ఆహ్వానిస్తున్నారు.
ఇప్పటికే భక్తకన్నప్ప సినిమా చేయబోతున్నట్లు ప్రకటించి అంచనాలను పెంచిన మంచు విష్ణు రెబల్ స్టార్ ప్రభాస్( Rebel star Prabhas ) ఇందులో శివుడి పాత్రలో నటించబోతున్నట్లు చెబుతూ ఆ అంచనాలను మరింత పెంచారు.తన సినిమాలో ప్రభాస్ భాగమవుతున్నారని మంచు విష్ణు స్వయంగా చెప్పారు.
దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ మూవీలో భాగమవుతున్నాడు అని తెలియడంతో ఈ సినిమా సక్సెస్ అవడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్లతో హోరెత్తించారు.ఇది ఇలా ఉంటే తాజాగా భక్తకన్నప్ప సినిమాకు సంబంధించి మరొక అదిరిపోయే అప్డేట్ వైరల్ అవుతోంది.ఆ అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది.ఆ అప్డేట్ ఏంటి అన్న విషయానికి వస్తే.ఇందులో మరో పాన్ ఇండియా స్టార్ అయినా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కూడా భాగం కానున్నారట.
ఇప్పటికే మంచు విష్ణు సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది.ఇందులో రోల్ చిన్నదే కావడంతో ఎన్టీఆర్ ఓకే అన్నారని సమాచారం.
అయితే ఈ చిత్రంలో మహా విష్ణుగా ఎన్టీఆర్ రోల్ ఉండనుందని తెలుస్తోంది.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.నిజంగా అభిమానులకు పూనకాలు తెప్పించే వార్తె అని చెప్పవచ్చు.ఇప్పటికే ప్రభాస్ రాకతో ఈ సినిమాపై అంచనాలు పెరగగా జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని ఎన్టీఆర్ అభిమానులు ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమా ఆ అంచనాలను నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి మరి.