మంచు విష్ణు భక్త కన్నప్పలో జూనియర్ ఎన్టీఆర్.. ఆ పాత్రలో కనిపించనున్నారా?

టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు( Manchu Vishnu ) మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టు భక్తకన్నప్ప ( Bhaktakannappa )సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పర్ఫెక్ట్ ప్లాన్స్ తో ముందుకు వెళ్తున్నారు విష్ణు.

అంతేకాకుండా ఈ సినిమా కోసం పాన్ ఇండియా హీరోలను ఆహ్వానిస్తున్నారు.ఇప్పటికే భక్తకన్నప్ప సినిమా చేయబోతున్నట్లు ప్రకటించి అంచనాలను పెంచిన మంచు విష్ణు రెబల్ స్టార్ ప్రభాస్( Rebel Star Prabhas ) ఇందులో శివుడి పాత్రలో నటించబోతున్నట్లు చెబుతూ ఆ అంచనాలను మరింత పెంచారు.

తన సినిమాలో ప్రభాస్ భాగమవుతున్నారని మంచు విష్ణు స్వయంగా చెప్పారు. """/" / దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ మూవీలో భాగమవుతున్నాడు అని తెలియడంతో ఈ సినిమా సక్సెస్ అవడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్లతో హోరెత్తించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా భక్తకన్నప్ప సినిమాకు సంబంధించి మరొక అదిరిపోయే అప్డేట్ వైరల్ అవుతోంది.

ఆ అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది.ఆ అప్డేట్ ఏంటి అన్న విషయానికి వస్తే.

ఇందులో మరో పాన్ ఇండియా స్టార్ అయినా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కూడా భాగం కానున్నారట.

ఇప్పటికే మంచు విష్ణు సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది.ఇందులో రోల్ చిన్నదే కావడంతో ఎన్టీఆర్ ఓకే అన్నారని సమాచారం.

"""/" / అయితే ఈ చిత్రంలో మహా విష్ణుగా ఎన్టీఆర్ రోల్ ఉండనుందని తెలుస్తోంది.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిజంగా అభిమానులకు పూనకాలు తెప్పించే వార్తె అని చెప్పవచ్చు.ఇప్పటికే ప్రభాస్ రాకతో ఈ సినిమాపై అంచనాలు పెరగగా జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని ఎన్టీఆర్ అభిమానులు ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమా ఆ అంచనాలను నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి మరి.

రామ్ కి సక్సెసులు రావాలంటే ఇదొక్కటే దారి…