అనుష్క ని నమ్మి కోట్ల రూపాయిలు నష్టపోయాను అంటూ సంచలన ఆరోపణలు చేసిన మంచు లక్ష్మి

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ సినీ ప్రస్థానం ఉన్న రెండు మూడు కుటుంబాలలో ఒకటి మంచు మోహన్ బాబు కుటుంబం.( Mohan Babu ) ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన ఆయన, విలన్ గా కెరీర్ ని ఆరంభించి, ఎన్నో వందల సినిమాల్లో నటించాడు.

 Manchu Lakshmi Shocking Comments On Heroine Anushka Shetty Details, Manchu Laksh-TeluguStop.com

అందులో ఎక్కువ శాతం విలన్ వేషాలే ఉండడం విశేషం.విలన్ గా జనాల మైండ్ లో అంతలా రిజిస్టర్ అయిన తర్వాత హీరోగా సక్సెస్ కావడం అనేది సాధారణమైన విషయం కాదు.

చిరంజీవి మరియు రజినీకాంత్ వంటి వారు కూడా ఇలా విలన్ రోల్స్ ద్వారానే ఫేమస్ అయ్యారు కానీ, వాళ్ళు అలా చేసింది కేవలం నాలుగైదు చిత్రాల్లో మాత్రమే.కానీ మోహన్ బాబు అలా కాదు.

హీరో గా ఆయనకి ఎన్నో సూపర్ హిట్స్ , బ్లాక్ బస్టర్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి.

Telugu Anushka, Anushka Shetty, Bhagamathi, Manchu Lakshmi, Manchulakshmi, Mohan

అంతే కాకుండా విద్యానికేతన్ స్కూల్ ని స్థాపించి అది నేడు విశ్వవిద్యాలం రేంజ్ కి ఎదిగేలా తీసుకొచ్చాడు.ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న మోహన్ బాబు తన వారసులను మాత్రం స్టార్స్ ని చెయ్యలేకపోయాడు.మంచు విష్ణు మరియు మంచు మనోజ్ కి కెరీర్స్ లో కొన్ని సక్సెస్ లు ఉన్నప్పటికీ వాటిని అదే విధంగా కొనసాగిస్తూ తమకంటూ ఒక స్టార్ స్టేటస్ ని తెచుకోలేకపొయ్యారు.

ఇక కూతురు మంచు లక్ష్మి( Manchu Lakshmi ) గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.ఈమె మీద సోషల్ మీడియా వచ్చినన్నీ మెమేలు ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ మీద కూడా వచ్చి ఉండదు.

ఈమె తన తొలిసినిమా ‘అనగనగా ఒక ధీరుడు’ చిత్రం తో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Telugu Anushka, Anushka Shetty, Bhagamathi, Manchu Lakshmi, Manchulakshmi, Mohan

ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె, తర్వాత ఫిమేల్ సెంట్రిక్ పాత్రలు ఉన్న సినిమాలు చేస్తూ వచ్చింది.ఈమె సినిమాల్లో కంటే కూడా టాక్ షోస్ తో మంచి పాపులారిటీ ని సంపాదించింది.ఈటీవీ మరియు మాటీవీ చానెల్స్ లో పెద్ద పెద్ద స్టార్ సెలెబ్రిటీలతో ఈమె ఇంటర్వ్యూ లు చేసింది.

ప్రస్తుతం ఆహా డిజిటల్ మీడియా లో ప్రసారమయ్యే వంట ప్రోగ్రాం లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.అయితే ఈమెకి టాక్ షోస్ అంటే విసుగొచ్చేసింది అట,కొద్దిరోజుల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమెకి టాక్ షోస్ నిర్వహించడం వల్ల ఎదురైనా సంఘటనలను చెప్పుకొచ్చింది.

ప్రతీ ఒక్కరు నన్ను టాక్ షోస్ చెయ్యమని మాత్రమే అడుగుతారని, మాట్లాడిన వాళ్ళతోనే ఎన్ని సార్లు మాట్లాడాలి అని నాకు బోర్ కొట్టి నేను చెయ్యను మొహం మీదనే చెప్పేసేదానిని అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

Telugu Anushka, Anushka Shetty, Bhagamathi, Manchu Lakshmi, Manchulakshmi, Mohan

ఇది ఇలా ఉండగా టాక్ షో నిర్వహిస్తున్నప్పుడు ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి( Anushka Shetty ) కారణం గా తనకి ఎదురైనా ఇబ్బంది ని , నష్టాలను చెప్పుకొచ్చింది.‘నేను నిర్వహించే ఒక టాక్ షోకి అనుష్క శెట్టి ని ఒక వారం ముఖ్య అతిథిగా ఆహ్వానించాము, ఆమె ముందుగా వస్తానని చెప్పింది.ఆమె కోసం గా మేము భారీగా ఏర్పాట్లు కూడా చేసుకున్నాము, మూడు కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యింది.

కానీ ఆ వారం ఆమెకి భాగమతి షూటింగ్ షెడ్యూల్ సడన్ గా ప్లాన్ చెయ్యడం వల్ల మా షో కి రాలేకపోయింది.ఆమె కోసం మేము చేసిన ఏర్పాట్లు మొత్తం వేస్ట్ అయ్యాయి, మూడు కోట్లు నష్టం వచ్చింది’ అంటూ లక్ష్మి ప్రసన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube