యూట్యూబ్‌లో వ్యూస్‌, ఫాలోవర్లను పెంచుకోవాలని ప్లేన్ క్రాష్.. చివరికి దిమ్మతిరిగే షాక్!

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో చాలామంది ప్రజలు పిచ్చి పనులు చేస్తూ షాక్‌లు ఇస్తున్నారు.కొందరు వీటి వల్ల ప్రాణం పోగొట్టుకుంటే, మరికొందరు జైలు పాలవుతున్నారు.

 Youtuber Intentionally Crashes Plane For Increasing Followers Details, Youtuber,-TeluguStop.com

ఇటీవల ట్రెవర్ జాకబ్( Trevor Jacob ) అనే 29 ఏళ్ల యూట్యూబర్ ఒక మూర్ఖత్వపు పని చేసి జైలు పాలయ్యాడు.ఈ యూట్యూబర్( Youtuber ) తన విమానాన్ని కావాలని నేల కూల్చాడు.

ఈ వ్యవహారం యూఎస్( US ) అధికారుల దృష్టికి రాగా అతడు నేరాన్ని చివరికి అంగీకరించాడు.అయితే మొదట క్రాష్ గురించి ఫెడరల్ పరిశోధకులకు అబద్ధం చెప్పాడు.

జాకబ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్కువ వ్యూస్, ఎక్కువ ఫాలోవర్లు పొందడం కోసం ఉద్దేశపూర్వకంగా 2021, డిసెంబర్‌లో కాలిఫోర్నియాలోని లాస్ పాడ్రెస్ నేషనల్ ఫారెస్ట్‌లో తన విమానాన్ని క్రాష్ చేసినట్లు అంగీకరించాడు.జాకబ్ క్రాష్ వీడియో “ఐ క్రాష్ మై ప్లేన్” అనే టైటిల్‌తో వైరల్ అయ్యింది.2.9 మిలియన్ల వ్యూస్ దీనికి వచ్చాయి.వీడియోలో, జాకబ్ తన విమానం పర్వతాలపైకి దూసుకుపోతున్నప్పుడు దాని నుంచి పారాచూట్ చేశాడు.జాకబ్ అబద్ధం చెప్పినప్పుడు యూఎస్ ఫెడరల్ పరిశోధకులకు జాకబ్ కథపై త్వరగా అనుమానం వచ్చింది.

ముఖ్యంగా జాకబ్ తన విమానం పవర్ కోల్పోయిందని నివేదించడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఎప్పుడూ ఫోన్ చేయలేదు.అతను కూడా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించలేదు.అంతేకాదు, బయలుదేరినప్పుడు జాకబ్ పారాచూట్ అప్పటికే ప్యాక్ చేసి ఉంది.ఇది అతను విమానాన్ని క్రాష్ చేయడానికి ప్లాన్ చేసినట్లు స్పష్టంగా తెలిసింది.తాను ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని క్రాష్ చేశానని జాకబ్ చివరికి పరిశోధకుల ముందు అంగీకరించాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్కువ వ్యూస్ రావాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశానని చెప్పాడు.జాకబ్ తన నేరాలకు 20 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది.అంటే వ్యూస్ మాట అటించితే ఇప్పుడు ఈ యూట్యూబర్‌ కటకటాల పాలై బొచ్చేలో కూడు తినాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇలాంటి ఉదాంతాలను చూసేనా భవిష్యత్తులో నెటిజన్‌లో పిచ్చి పనులు చేయడానికి జంకుతారని ఆశిద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube