సోషల్ మీడియా వచ్చాక ఎన్నో విషయాలను మనం తెలుసుకోగలుగుతూ ఎదుటివారికి తెలియజేస్తున్నాము.ఈ క్రమంలో కొన్ని రకాల దారుణమైన ఘటనలు కూడా జనాలకి చేరుతున్నాయి.
ఈ మధ్య కాలంలో చూసుకుంటే, మెట్రో రైలులో( Metro Trains ) జరిగిన అనేక విషయాలు గురించిన వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఘటన నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.
విషయం ఏమిటంటే, మెట్రోలో ప్రయాణించిన ఒక వ్యక్తి నిద్ర మత్తులో( Sleeping ) పక్కన కూర్చొన్న ప్రయాణికుడి భుజంపై తలపెట్టి నిద్రపోయాడు.ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు తీవ్రంగా స్పందిస్తాడు.ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది.ఇది కాస్త ముదరడంతో ఏకంగా వారు కొట్లాడుకోవడం మొదలు పెడతారు.ఆ దృశ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో( Newyork ) జరిగినట్టు భోగట్టా.ఒక వ్యక్తి నిద్రపోతూ పక్కన కూర్చొన్న తోటి ప్రయాణికుడి భుజంపై తలమోపాడు.
దీనిపై అతడు అభ్యంతరం వ్యక్తం చేశాడు.ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం కాస్త తీవ్రస్థాయికి చేరుతుంది.
దీంతో తన భుజంపై నిద్రపోయిన వ్యక్తిని మరో వ్యక్తి మోచేతితో పలుమార్లు కొట్టడం ఇక్కడ వీడియోలో మనకు కనిపిస్తుంది.కాగా, మెట్రో రైలులోని ఎదురు సీట్లో కూర్చొన్న బాధిత వ్యక్తి స్నేహితుడు దీనిపై జోక్యం చేసుకోవడం ఇక్కడ స్పష్టంగా మనం చూడవచ్చు.దాడి చేసిన వ్యక్తితో అతడు ఫైట్ కూడా చేశాడు.ఈ నేపథ్యంలో వారిద్దరూ కొంతసేపు కొట్టుకోవడం మనకు చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది.ఇంతలో ఒక స్టేషన్‌లో మెట్రో రైలు ఆగగా బాధిత వ్యక్తి, అతడి స్నేహితుడు అక్కడ దిగిపోయారు.అనంతరం దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మెట్రో రైలులో ప్రయాణం కొనసాగించిన దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఇపుడు గాలిస్తున్నారు.
మరోవైపు మెట్రో ట్రైన్‌లో ప్రయాణికులు కొట్టుకున్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.