తమ్ముడుని కాస్త అన్నను చేశారంటున్న స్టార్ క్రికెటర్ సోదరి..!

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఐపీఎల్ లీగ్ ద్వారా తనలోని టాలెంట్ ని బయటపెట్టి బాగా ఫేమస్ అయ్యారు.చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన ఆయన ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లో ఆడే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు.

 Star Cricketer Sister Malti Chahar Trolls On Wikipedia, Malti Chahar,deepak Chah-TeluguStop.com

వన్డే మ్యాచ్లలో కూడా దీపక్ చాహర్ ని టీమిండియా జట్టు ఎంపిక చేసుకుంది.దీపక్ వయసు కేవలం 28 సంవత్సరాలు కానీ వికీపీడియా పేజీ లో మాత్రం ఆయన వయస్సు 48 సంవత్సరాలు అని పేర్కొన్నారు.అయితే ఈ తప్పును గమనించిన దీపక్ అక్క మాలతి చాహర్ ట్విట్టర్ వేదికగా కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు.

“వికీపీడియా కి ధన్యవాదాలు.తమ్ముడైన దీపక్ ని నాకు అన్నయ్యని చేశారు” అని వ్యంగ్యం గా ఆమె వికీపీడియాలో దీపక్ వయసుని పాయింట్ ఔట్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.48 ఏళ్ల కు కూడా ఫిట్ గా ఉన్న ప్లేయర్ అని కూడా ఆమె నవ్వుతూ వికీపీడియా పై సెటైర్ వేశారు.

అయితే ప్రొఫెషనల్ మోడల్ అయిన మాలతీ తన తమ్ముడి వయసు గురించి ఫన్నీ కామెంట్ చేయడంతో.ఆమె పోస్టు క్షణాల్లోనే వైరల్ అయింది.కొందరు నెటిజన్లు వికీపీడియా అని టైప్ చేసి తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.మరికొందరు మాత్రం ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఇక దీపక్ ని అన్నయ్య అని పిలవండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వికీపీడియా పేజీ లో దీపక్ చాహర్ బర్తడే ఆగస్టు 7 1972 అని ఉంది.నిజానికి ఆయన 1992 ఆగస్టు 7వ తేదీన జన్మించారు.కానీ పొరపాటున ఒక సంఖ్య ఆ తప్పు పడడంతో ఆయన వయస్సు 20 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది.దీంతో 28 ఏళ్ల కుర్రాడు 48 ఏళ్ల ముసలోడు అయిపోయాడు.

ఇది గమనించిన దీపక్ అక్క ఫన్నీగా వికీపీడియా పై సెటైర్లు వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube