సీనియర్ నటుడు నరేశ్( Naresh ), పవిత్రా లోకేశ్ ( Pavithra Lokesh ) జంటగా నటించిన సినిమా ‘మళ్ళీ పెళ్లి‘( Malli Pelli ) రీసెంట్ గా ఓటిటిలో రిలీజైన సంగతి తెలిసిందే.అప్పటికే మీడియాలో పాపులర్ అయినటువంటి ఈ జంట ఇలా మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా గురించి భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే థియేటర్లలో మాత్రం ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిందని తెలుస్తుంది.ఇకపోతే ఈ సినిమా ఓటీటీలో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన విషయం మనకు తెలిసింది.
ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియ ( Amazon Prime Video ) లో పాటు ఆహా(Aha) లో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

జూన్ 23వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో ప్రసారమవుతుంది.ఈ వారంలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీల్లో టాప్ 10లో నిలిచింది.కానీ ఇప్పుడు ఓ ట్విస్ట్ వచ్చి పడింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఈ మూవీని తొలగించింది. ఇలా అమెజాన్ వారు ఈ సినిమాని తొలగించడంతో ఈ సినిమా కేవలం ఆహాలో మాత్రమే ప్రసారమవుతుంది.
ఈ సినిమా అమెజాన్ వారు తొలగించడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే కొన్ని లీగల్ ఇష్యూస్ కారణంగానే ఈ సినిమాని అమెజాన్ వారు తొలగించారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ( Ramya Ragupathi ) అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహా వారికి లీగల్ నోటీసులు జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా తన వ్యక్తిగత ప్రతిష్టను కించపరిచే విధంగా ఉందని అందుకే ఈ సినిమా ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే దాని ప్రభావం కారణంగానే ఈ సినిమాని అమెజాన్ వారు తెలుగుతోపాటు కన్నడ భాషలో కూడా తొలగించినట్లు తెలుస్తోంది.
కానీ ఆహా మాత్రం ఈ సినిమాని ప్రసారం చేస్తున్నారు.