జలకన్య కన్ను అమ్మకానికి వుంది... 2 కోట్లు పైమాటే, మీకు కావాలా నాయనా?

జలకన్యల గురించి కధలు కధలుగా వినే వుంటారు.ఇంకా చాలామంది కవులు తమ కావ్యాలలో తమకి ఇష్టమైన స్త్రీలను జలకన్యగా ఊహించుకున్న ఘటనలు అనేకం వున్నాయి.

 Malkajgiri Police Arrest Two Cheating In The Name Of Mermaid Eye Details, Jalaka-TeluguStop.com

ఇక సినిమాలకైతే లెక్కేలేదు.ఈ జలకన్య అనే పాయింట్ తో హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలా సినిమాలు వచ్చాయి.

మన తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన ‘సాహసవీరుడు సాగర కన్య’ సినిమా అయితే ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఆ సినిమాలో సాగర కన్యగా శిల్ప శెట్టి ఇరగదీసింది అని చెప్పుకోవాలి.

ఇక ఇంతవరకు మనం చెప్పుకున్నది ఒక కల్పన మాత్రమే.నిజంగా సాగరాలలో జలకన్యలు వుంటాయో లేదో ఎవరికీ తెలియదు.అది ఒక అభూత కల్పన మాత్రమే.అయితే మనలో చాలామంది జలకన్యలు ఉంటారని నమ్ముతారు.

కానీ అది నిజం కాదు.అలాగని ఎవరన్నా అంటే మీరు నమ్మవద్దు.

అయితే ఇక్కడ సరిగ్గా ఆ నమ్మకాన్ని కొంతమంది కేటుగాళ్లు క్యాష్ చేసుకోవాలని పట్టుబడ్డారు.

Telugu Chandu, Jalakanya, Latest, Malkajgiri, Mermaid Eye, Mermaids, Samba Shiva

వివరాల్లోకి వెళితే, సాగర కన్య కన్నుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని, అది ఇంట్లో పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుందని, కల్లబొల్లి మాటలు మాటలు చెప్పిన వారిని మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసారు.వరంగల్ కు చెందిన చందు, యాప్రాల్ కి చెందిన సాంబశివ ఇద్దరు స్నేహితులు.తీర్థయాత్రల నిమిత్తం షిరిడీకి వెళ్లిన వీరు తిరుగు ప్రయాణంలో స్థానికంగా దొరికే రంగు రాయిని కొనుగోలు చేసి,

Telugu Chandu, Jalakanya, Latest, Malkajgiri, Mermaid Eye, Mermaids, Samba Shiva

రంగురాయిలో బ్యాటరీ సహాయంతో చిన్నపాటి లైట్లు అమర్చారు.కాగా లైట్ అమర్చిన రంగురాయికి నీళ్లు తాకగానే కాంతి రెట్టింపు అవుతుంది.దీన్ని క్యాష్ చేసుకోవాలని కాప్రాలో పలువురు వ్యాపారులు, స్థానికులకు చూపించి.రూ.2 కోట్లకు విక్రయించబోయారు.అయితే సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube