సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం కంటే ఎక్కువ కంప్లీట్ చేసుకుంది.ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.
ఈ సినిమాను పరుశురామ్ సామజిక అంశాలతో తెరకెక్కిస్తున్నాడు.
బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మహేష్ ఈ సినిమా తర్వాత రాజమౌళి తో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ఫిక్స్ అయ్యింది.
అయితే రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాకు ఇంకా చాలా టైం ఉంది.
అందుకే మహేష్ ఈ గ్యాప్ లో మరొక రెండు సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు.మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.వీరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.
అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అతడు సినిమా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా ఖలేజా సినిమాను కామిడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.
అయితే వీరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాను ఒక రేంజ్ లో తీయబోతున్నాడని సమాచారం.ఈ సినిమాను ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ అన్ని కలిపి అతడు సినిమాలాగే ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్.
ప్రస్తుతం ఈయన ఈ సినిమా కథను రెడీ చేసే పనిలో ఉన్నాడట.ఈ సినిమా హాసిని అండ్ హారిక బ్యానర్ లో నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.మొత్తానికి హ్యాట్రిక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ లు బద్దలు కొట్టేందుకు ఈ కాంబో సిద్ధం అవుతుంది.