సర్కారు వారి పాట మహేష్‌ ‘అతిథి’ను గుర్తుకు తెస్తుంది

సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 27వ చిత్రం అధికారిక ప్రకటన వచ్చింది.సినిమాకు సర్కారు వారి పాట అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా ప్రకటించడంతో పాటు మహేష్‌బాబు లుక్‌ విషయంలో కూడా కాస్త క్లూ ఇచ్చారు.

 Mahesh Babu Sarkaru Vari Pata First Look Remembering In Athidi Movie, Mahesh B-TeluguStop.com

ప్రీ లుక్‌ విడుదల చేయడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.మెడపై రూపాయి కాయిన్‌ గుర్తు మరియు చెవికి పోగు చాలా ట్రెండీగా కనిపిస్తున్నాడు.

ఇక హెయిర్‌ కూడా చాలా కొత్తగా కనిపించబోతుంది.

Telugu Athidi, Mahesh Babu, Parushuram-Movie

సర్కారు వారి పాట చిత్రంలో మహేష్‌బాబు ఎలా ఉండబోతున్నాడో ఇప్పటికే ఫ్యాన్స్‌కు అవగాహణ వచ్చేసింది.ఇదే సమయంలో కొందరు నెటిజన్స్‌ మహేష్‌బాబు లుక్‌ ఆయన డిజాస్టర్‌ మూవీ ‘అతిథి’లో మాదిరిగా ఉందని అంటున్నారు.ఇప్పుడు ఈ పోస్టర్‌లో ఉన్నట్లుగానే అతిథిలో మహేష్‌బాబు ుక్‌ ఉంటుందని, ఇప్పుడు ఆ సెంటిమెంట్‌ కంటిన్యూ అయితే ఈ సినిమా పరిస్థితి ఏంటీ అంటూ వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Athidi, Mahesh Babu, Parushuram-Movie

మహేష్‌బాబు కొత్త లుక్‌ ప్రయత్నించిన ప్రతి సారి కూడా సినిమా నిరాశపర్చుతూ వచ్చింది.అందుకే మహేష్‌బాబు లుక్స్‌ విషయంలో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేకుండానే ముందుకు వెళ్తాడు.కాని ఈసారి మాత్రం మహేష్‌బాబు సర్కారు వారి పాటకు గాను చాలా ట్రెండీగా కనిపించడంతో పాటు చెవికి పోగుతో కూడా నటించబోతున్నాడు.మరి అతిథి వంటి ఫలితం వస్తుందా లేదంటే రికార్డు బ్రేక్‌ అవుతుందా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube