నన్ను హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు.. మాధురి దీక్షిత్

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి, ఆమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.సినిమాలలో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తూ ఉంటుంది.

 Madhuri Recalls People Said She Doesnt Look Like A Heroine In Early Career, Madh-TeluguStop.com

అప్పట్లో ఈమె అందానికి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.అంతేకాకుండా ఇప్పటికే ఈమెకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధురి దీక్షిత్ పలు ఆసక్తికర విషయాల గురించి వెల్లడించింది.మొదట మాధురి దీక్షిత్ అబోధ్ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత వచ్చిన తేజాబ్ అనే సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాధురి తన కెరీర్ లో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అలా ఎన్నో సినిమాల్లో నటించి జాతీయ అవార్డులు ఫిలింఫేర్ అవార్డులను సైతం సొంతం చేసుకుంది.ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ఈమె కెరీర్ మొదట్లోఎదుర్కొన్న విమర్శల గురించి కూడా తెలిపింది.

సినీ నటిగా ఆమె మొదలు పెట్టినప్పుడు చాలా యంగ్ కావడంతో చిన్న దానిలో కనిపించేదట.

Telugu Bollywood, Career, Madhuri Dixit-Movie

దీనితో ఆమెను హీరోయిన్ మెటీరియల్ కాదు, హీరోయిన్ లా కనిపించడం లేదు అంటూ విమర్శలు చేశారట.అప్పట్లో హీరోయిన్ అంటే కేవలం ఇలాగే ఉండాలి అన్న అపోహలు చాలామందిలో ఉండేవి అని చెప్పుకొచ్చింది మాధురీ దీక్షిత్.అలాంటి పరిస్థితులను నేను కూడా ఎన్నో ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో తన తల్లి తనను చాలా ప్రోత్సహించారు అని చెప్పుకొచ్చింది మాధురి దీక్షిత్.ఎవరు ఎన్ని అన్నా కూడా పట్టించుకోకుండా నీ పని సక్రమంగా చేయి గుర్తింపు దానంతట అదే వస్తుంది అని చెప్పిందట.

అలా ప్రతి ఒక్క విషయంలో కూడా అమ్మ సలహాలు తీసుకుంటా అని చెప్పుకొచ్చింది మాధురి దీక్షిత్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube