అదృష్టం అంటే వీరిదే.. కొంచెం మిస్ అయినా ప్రాణాలే పోయేవి..

ఈ సృష్టిలో ప్ర‌మాదం అనేది ఎటునుంచి ఎప్పుడు వ‌స్తుందో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు.ఎందుకంటే నిముషం ముందుకూడా ప్ర‌శాంతంగా ఉన్న ప్రాంతం కాస్తా భ‌యంక‌రంగా మారిపోతుంది.

 Luck Means This One Even A Little Miss Will Save Lives, Luck, Viral Video, Luck-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే మ‌న‌కు రోడ్డు మీద వెళ్లే వాహ‌నాల‌కు అనుకోకుండా జ‌రిగే యాక్సిడెంట్ల‌ను చూసిన‌ప్పుడు చాలా క్లియ‌ర్గా అర్థ‌మవుతుంది.అందుకే ఎప్పుడు ఎక్క‌డి నుంచి ప్ర‌మాదం వ‌స్తుందో చెప్ప‌డం అంత ఈజీ కాదు.

అనుకోకుండా జ‌రిగే ఘ‌ట‌న‌లు మ‌న‌కు బ‌య‌టే కాదు అప్పుడ‌ప్పుడు కొన్ని ఇండ్ల‌ల్లో కూడా క‌నిపిస్తుంది.

ఇక ఇప్పుడు కూడా ఓ ఇంట్లో జ‌రిగిన ఘ‌ల‌న చాలా వైర‌ల్ అవుతోంది.

అయితే ఇలా జ‌రిగే కొండంత ప్రమాదాన్ని కూడా అప్పుడ‌ప్పుడు మ‌న చిన్న అదృష్టం వాటి నుంచి మ‌న ప్రాణాల్ని కాపాడుతుంది.ఇక ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే వీడియోలో కూడా వారి అదృష్టమే వారి ప్రాణాలును కాపాడింది.

చూడ‌టానికి భయాన్ని కలిగిస్తున్న ఈ వీడియోలో కుటుంబంలోని ఆరుగురు క‌లిసి ఆనందంగా హాయిగా హాల్‌లో కింద కూర్చొని ఏవో తింటూ క‌నిపిస్తుంటారు.అయితే అనుకోకుండా పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగింది.

స‌డెన్ గా పైన గిర గిరా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ డ‌మాల్ మ‌ని వారి మీద ప‌డిపోయింది.అయితే ఇక్క‌డే వారి అదృష్టం బాగుంది.ఎందుకంటే ఆ ఫ్యాను కాస్తా సరిగ్గా వారి మధ్యలో పడింది.ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ఎవ‌రి త‌ల అయినా ప‌గిలిపోయి ఉండేది.ఇక చిన్న పిల్లాడికి కొంచెం ముందుగా ఆ ఫ్యాను ప‌డింది.దీంతో అత‌ను బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాడు.

అయితే ఈ ప్ర‌మాదంలో ఆరుగురిలో ఒక్కరంటేఏ ఒక్క‌రికీ దెబ్బ‌లు త‌గ‌ల్లేదు.కాగా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట కామెంట్ల వ‌ర్షం కురిపిస్తోంది.

ఇది చూసిన వారంతా కూడా అదృష్టం అంటే వీరిదే అంటూ చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube