నైరుతి లండన్( London )లో జరిగిన స్ట్రీట్ ఫైట్( Street fight )లో కత్తిపోట్లతో మరణించిన బ్రిటీష్ సిక్కు యువకుడిని సిమర్‌జీత్ సింగ్ నంగ్‌పాల్‌గా మెట్ పోలీసులు గుర్తించారు.బుధవారం తెల్లవారుజామున లండన్ హౌన్స్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 17 ఏళ్ల సిమర్‌జీత్ హత్యకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
హత్యకు బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందు వుంచేందుకు సమాజానికి భరోసా ఇవ్వడంతో పాటు సిమర్‌జిత్ మరణానికి దారితీసిన ఘటనల వరుస క్రమాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని స్పెషలిస్ట్ క్రైమ్ యూనిట్ డిటెక్టివ్‌లు తెలిపారు.

ఈ ఘటనపై డిటెక్టివ్ ఇన్‌స్పెకటర్ మార్టిన్ థోర్ప్ మాట్లాడుతూ.సిమర్‌జీత్( Simarjeet ) హత్యకు బాధ్యులను గుర్తించడానికి తాము 24 గంటలూ కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ విషాద ఘటనపై సమాచారం వుంటే పోలీసులను సంప్రదించాలని ఆయన పౌర సమాజాన్ని కోరారు.
ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశామని , విచారణ కొనసాగుతుందని థోర్ప్ పేర్కొన్నారు.ఎవరైనా తమ ఫోన్, డాష్ కెమెరాలు, డోర్‌బెల్ ఫుటేజ్‌లలో ఈ హత్యను చిత్రీకరించినట్లయితే ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

బుర్కెట్ క్లోస్, హౌన్‌స్లో ప్రాంతంలో కొందరు గొడవ పడుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వారు ఘటనాస్థలికి చేరుకునేసరికి నంగ్‌పాల్ కత్తిపోట్లతో కనిపించాడు.వెస్ట్ లండన్‌లో సీఐడీ హెడ్ డిటెక్టివ్ సూపరింటెండెంట్ ఫిగో ఫోరౌజాన్ మాట్లాడుతూ.ఈ క్లిష్ట సమయంలో మా ఆలోచనలు సిమర్‌జీత్ కుటుంబంతో వుంటాయన్నారు.ఈ ఘటన నిస్సందేహంగా ఆందోళన కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.బాధ్యులను కనుగొనడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తామని.
రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అదనపు సిబ్బంది గస్తీ విధుల్లో పాల్గొంటారని ఫిగో పేర్కొన్నారు.ఏమైనా సమస్యలు వుంటే వారి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు.
ఈ కేసులో నలుగురు నిందితులను ఘటనాస్థలిలోనే అరెస్ట్ చేసినట్లుగా సమాచారం.వారిలో ఇద్దరిని తొలుత ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు రాకముందే వారికి గాయాలయ్యాయి.ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వారిని కస్టడీలోకి తీసుకున్నారు.