తమిళ స్టార్ హీరో విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం లియో.( Leo Movie ) భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
ఈ ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఇది లోకేష్, విజయ్ ల రేంజ్ సినిమా కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో లియో మూవీపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది.
లోకేష్( Lokesh Kanagaraj ) మీద కాపీ మరకలు మరోసారి ట్రెండ్ అయ్యాయి.ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్ సినిమాకు రిఫరెన్స్, కాపీలా సినిమా ఉందని తెలిసిందే.
అందుకే లోకేష్ ముందుగానే ఆ సినిమాకు టైటిల్స్‌లో క్రెడిట్ ఇచ్చాడు.

ఇక గాయం 2, వారసుడు సినిమాల్లా ఉందంటూ ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు.ఖైదీ, విక్రమ్‌ల తరువాత లియో లాంటి సినిమా తీస్తాడని అనుకోలేదంటూ లోకేష్ పై ఫ్యాన్స్ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.లియో నిడివి మీద కూడా ముందు నుంచీ చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఓవర్సీస్‌లో, ఐమాక్స్ వర్షెన్‌లో తేడా ఉందని జనాలు కామెంట్లు చేస్తున్నారు.క్లైమాక్స్( Leo Climax ) విషయంలో తేడా ఉందని అంటున్నారు.
పార్తీబన్( Parthiban ) లియో అని కేవలం అర్జున్‌కు మాత్రమే తెలుసనీ, తాము చూసిన సినిమాలో అంతే ఉందని అంటున్నారు కొంత మంది.అర్జున్,( Arjun ) సంజయ్ దత్( Sanjay Dutt ) పాత్రలకు చనిపోయే ముందు పార్తీబనే లియో అని తెలుస్తుంది.

అది తెలిశాకే ఇద్దరూ చనిపోతారు.కానీ కొంత మందికి మాత్రం కేవలం అర్జున్ పాత్రకే ఆ నిజం తెలుస్తుందని అనుకుంటున్నారు.ఇలా కొన్ని చోట్ల సినిమాను తక్కువ నిడివితో వేయడం, ఇలా కట్ చేసి చూపించడంతో తేడాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.దీంట్లో ఏదైనా మర్మం ఉందా? లేదా ఎడిటింగ్ లోపమా? అన్నది తెలియడం లేదు.లోకేష్ ఇది కూడా సరిగ్గా చూసుకోలేకపోయాడా? అని అంతా ఫైర్ అవుతున్నారు.ప్రమోషన్స్ కూడా ఒక్కడే భుజం మీద వేసుకుని చేశాడు.
కనీసం త్రిష కూడా బయటకు రాలేదు.విజయ్( Vijay ) అయితే సినిమాను పట్టించుకున్నట్టుగా కూడా లేదని నెటిజన్లు అంటున్నారు.