ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాగుంట రాఘవని కోర్టులో హాజరుపర్చలేదని తీహార్ జైలు సూపరింటెండెంట్ పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో రాఘవను ఎల్లుండి విచారణకు వర్చువల్ గా హాజరు పరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం మాగుంట రాఘవ వెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.