శ్రీశైల జలాశయానికి మళ్ళీ వరద ఉదృతి భారీగా పెరిగింది ఈ ఏడాదిలో ఐదోవసారి ప్రాజెక్టు రేడియల్ క్రేస్ట్ గేట్లలో 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దీనితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపు ఊరుకలేస్తుంది ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల,సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 2,98,404 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 3,43,376 క్యూసెక్కులు వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 885 అడుగులగా ఉంది పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.8070 టీఎంసీలుగా ఉంది శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది ఇలాగే వరద పెరిగితే రేడియల్ క్రేస్ట్ గేట్లు మరి కొంచెం (ఫిట్)ఎత్తు పెంచి వరద నీటిని దిగువకు వదులుతామని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు.