అత్యాచారం చేస్తే పిచ్చిదాన్నైపోయా.. స్టార్ సింగర్ సంచలన వ్యాఖ్యలు..?

మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో సింగర్ గా లేడీగాగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. 35 సంవత్సరాల ఈ లేడీ సింగర్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

 Lady Gaga Comments About Producer Molestation And Pregnancy, Comments About Prod-TeluguStop.com

తాజాగా ఈ సింగర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.గతంలో జరిగిన అనుభవాల గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.19 సంవత్సరాల వయస్సులో ఒక నిర్మాత తనపై బలవంతం చేశారని లేడీగాగా చెప్పారు.

నిర్మాత అత్యాచారం చేయడంతో తాను ఆ వయస్సులోనే గర్భవతిని కావాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

ఆ తరువాత కూడా ఆ నిర్మాత తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని లేడీగాగా వెల్లడించారు.అత్యాచారానికి అంగీకరించని పక్షంలో సింగర్ గా తనకు వచ్చే అవకాశాలను రాకుండా చేస్తానని బెదిరించారని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ అనుభవం గురించి పంచుకుంటూ లేడీ గాగా కీలక విషయాలను వెల్లడించారు.

ఈ అత్యాచార ఘటన జరిగిన తర్వాత ఆ నిర్మాత తనను ఒక స్టూడియోలో బంధించారని ఆమె వెల్లడించారు.

ఆ టైమ్ లో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆమె పేర్కొన్నారు.ఈ ఘటన జరిగిన తర్వాత తాను సాధారణ మనిషిగా మారడానికి రెండున్నర సంవత్సరాలు పట్టిందని ఆమె పేర్కొన్నారు.

ఆ సమయంలో తాను గడిపిన రోజులు తనకు చీకటి రోజులు అని లేడీగాగా చెప్పుకొచ్చారు.

Telugu Lady Gaga, Preganancy-Movie

అయితే తనను ఇబ్బంది పెట్టిన నిర్మాత పేరు చెప్పడానికి మాత్రం లేడీగాగా అస్సలు ఇష్టపడలేదు.తన జీవితంలో మళ్లీ ఆ నిర్మాతను ఎదుర్కోవడం తనకు అస్సలు ఇష్టం లేదని ఆమె అన్నారు.ది మీ యూ కాంట్ సీ అనే డాక్యుమెంటరీలో లేడీ గాగా నటించగా రెండు రోజుల క్రితం ఈ డాక్యుమెంటరీ రిలీజైంది.

ఈ డాక్యుమెంటరీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube