అత్యాచారం చేస్తే పిచ్చిదాన్నైపోయా.. స్టార్ సింగర్ సంచలన వ్యాఖ్యలు..?

మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో సింగర్ గా లేడీగాగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

35 సంవత్సరాల ఈ లేడీ సింగర్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

తాజాగా ఈ సింగర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

గతంలో జరిగిన అనుభవాల గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.19 సంవత్సరాల వయస్సులో ఒక నిర్మాత తనపై బలవంతం చేశారని లేడీగాగా చెప్పారు.

నిర్మాత అత్యాచారం చేయడంతో తాను ఆ వయస్సులోనే గర్భవతిని కావాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

ఆ తరువాత కూడా ఆ నిర్మాత తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని లేడీగాగా వెల్లడించారు.

అత్యాచారానికి అంగీకరించని పక్షంలో సింగర్ గా తనకు వచ్చే అవకాశాలను రాకుండా చేస్తానని బెదిరించారని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ అనుభవం గురించి పంచుకుంటూ లేడీ గాగా కీలక విషయాలను వెల్లడించారు.ఈ అత్యాచార ఘటన జరిగిన తర్వాత ఆ నిర్మాత తనను ఒక స్టూడియోలో బంధించారని ఆమె వెల్లడించారు.

ఆ టైమ్ లో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆమె పేర్కొన్నారు.

ఈ ఘటన జరిగిన తర్వాత తాను సాధారణ మనిషిగా మారడానికి రెండున్నర సంవత్సరాలు పట్టిందని ఆమె పేర్కొన్నారు.

ఆ సమయంలో తాను గడిపిన రోజులు తనకు చీకటి రోజులు అని లేడీగాగా చెప్పుకొచ్చారు.

"""/"/ అయితే తనను ఇబ్బంది పెట్టిన నిర్మాత పేరు చెప్పడానికి మాత్రం లేడీగాగా అస్సలు ఇష్టపడలేదు.

తన జీవితంలో మళ్లీ ఆ నిర్మాతను ఎదుర్కోవడం తనకు అస్సలు ఇష్టం లేదని ఆమె అన్నారు.

ది మీ యూ కాంట్ సీ అనే డాక్యుమెంటరీలో లేడీ గాగా నటించగా రెండు రోజుల క్రితం ఈ డాక్యుమెంటరీ రిలీజైంది.

ఈ డాక్యుమెంటరీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో సెలబ్రిటీ స్టేటస్ ను అందుకున్న సినీ ప్రముఖులు వీళ్లే!