ఇటలీ లో విషాదకర ఘటన..తెలుగు విద్యార్ధి మృతి..!!!

విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని, తమను చదివించడం కోసం ఎంతో కష్టపడిన తల్లి తండ్రులు సంతోషించేలా ఉన్నత స్థానాలలో నిలిచి, ఆర్ధికంగా స్థిరపడాలని ఎంతో మంది యువత ఆరాటపడుతుంటారు.ఈ క్రమంలోనే దూరమైనా సరే తల్లి తండ్రులను విడిచి దేశం కాని దేశం ఉన్నత చదువుల కోసం వెళ్తుంటారు.

 Kurnool Student Died In Italy After Drowns In Sea Water,italy,indian Student,ind-TeluguStop.com

అక్కడ చదువు పూర్తవగానే మంచి ఉద్యోగం సంపాదించి తల్లి తండ్రులకు బహుమతిగా ఇస్తారు.విదేశాలు వెళ్లి చదువుకునే ప్రతీ విద్యార్ధి కల ఇలానే ఉంటుంది.

అయితే కొందరి కలలు విజయవంతంగా పూర్తయితే మరి కొందరి కలలు విషాదంతో ముగుస్తాయి.ఏపీ కి చెందిన ఓ తెలుగు విద్యార్ధి జీవితం ఇటలీ లో అర్ధంతరంగా ముగిసిపోయింది.


ఏపీ లోని కర్నూల్ కి చెందిన దిలీప్ అనే యువకుడు ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్ళాడు.అగ్రికల్చర్ బీఏస్సీ వరకూ ఇక్కడ చదివిన దిలీప్ కేవలం ఏంఎస్సీ చేయడం కోసం ఇటలీ వెళ్ళాడు.

అక్కడ ఎంఎస్సీ చదువుతున్నాడు.వర్సిటీకి సెలవులు ఇవ్వడంతో స్వస్థలం చేరుకొని తల్లి తండ్రులను కలిసి మళ్ళీ ఇటలీ వెళ్లాలని భావించాడు.

రెండు రోజుల్లో తల్లి తండ్రుల వద్దకు వెళ్తాడనగా స్నేహితులు అందరితో కలిసి ఇటలీలోని మంతార్సో బీచ్ కు విహార హాత్రకు వెళ్ళాడు.ఈ క్రమంలోనే ఊహించని విధంగా బలమైన అలలు దిలీప్ ను సముద్రంలోనికి తీసుకుపోవడంతో కొంత సేపటి వరకూ దిలీప్ ఆచూకి తెలియలేదు.

అదే రోజు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో దిలీప్ మృతి దేహం వడ్డుకు రావడంతో అతడు మృతి చెందిన విషయాన్ని ఎపీలోని తల్లి తండ్రులకు తెలిపారు సన్నిహితులు.ఈ విషయం తెలియడంతో దిలీప్ కుటుంభంలో విషాద చాయలు అలుముకున్నాయి.

కాగా దిలీప్ మృత దేహాన్ని ఇటలీ నుంచీ స్వస్థలం తెప్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ను కోరారు.ఇదిలాఉంటే దిలీప్ మృత దేహం ఇటలీ నుంచీ ఎపీకి తీసుకురావడానికి సుమారు ౧౫ రోజులు పడుతుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube