వరంగల్ విజయసంకల్పయాత్రలో తమపై అంశాల వారీగా తీవ్ర విమర్శలు చేసిన ప్రదాని మోడి( Modi ) వాఖ్యల పై తెలంగాణ మీడియా లో బారీ చర్చ లు నడిచాయి ఈ ప్రచారం తమకు నష్టం కలిగిస్తుంది అని గ్రహించిన బారాస నాయకత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది .మోడి వాఖ్యల పై తీవ్రస్థాయిలో జవాబు ఇస్తూ ఒక నోట్ విడుదల చేశారు బారాస జాతీయ కార్యదర్శి కల్వకుంట్ల తారక రామారావు( Kalvakuntla Taraka Rama Rao ).
కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత భాజపాకు లేదని విమర్శించిన కేటీఆర్( KTR ) మోడీ తన క్యాబినెట్ లో కూడా చాలామంది కుటుంబ రాజకీయాల నుంచి వచ్చారన్న విషయాలను గుర్తించుకోవాలని తెలిపారు.
తమది రాష్ట్రాన్ని దోచుకునే కుటుంబం కాదని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని మా కుటుంబ సభ్యులు గా భావించి వారి సర్వతో ముఖాభివృద్ధికి సహాయపడే కుటుంబమని, దేశంలో 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఖాళీ పెట్టుకుని రాష్ట్రంలో రెండు లక్షల కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన తమపై విమర్శలు చేయటం ఎంత మేరకు సభభో ప్రధాని ఆలోచించుకోవాలని కేటీఆర్ హితవు పలికారు .మోడీల అబద్ధాలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలని తాము చేయని వాటిని కూడా తమ ఖాతాలో వేసుకునే మోసానికి బిజెపి పాల్పడుతుందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ( Kazipet Railway Coach Factory )తమ దశాబ్దాల కల అని తెలంగాణ ప్రజల ఆకాంక్షైన కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో ఏదో రిపేర్ షాప్ కేటాయించి తెలంగాణకి ఏదో మేలు చేశామని ఉద్ధరించామన్నట్టుగా మాట్లాడుతున్న భాజపా నేతల వైఖరి హాస్యాస్పదంగా ఉందని ఆయన తెలిపారు.
యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి మోకాలు అడ్డుతున్న గవర్నర్ కి ప్రదాని ఒక మాట చెప్పి ఉంటే ఇక్కడ కొన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగి ఉండేవారమని, గిరిజన యూనివర్సిటీ అడ్డుకున్న మోడీ గిరిజన విద్యార్థులపై సానుభూతి చూపించడం విచిత్రంగా ఉందని కేటీఆర్ అన్నారు.ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప చేతల్లో భాజాపా ప్రభుత్వం చేసేదేమీ ఉండదని పైకి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెబుతున్నప్పటికీ వారి అసలు ఉద్దేశం మాత్రం గుజరాత్ గా సాత్గుజరాత్ కా వికాస్ మాత్రమేనని ఆయన విమర్శలు చేశారు .ఏది ఏమైనా తమపై ఫుల్ ఫోకస్ పెట్టి అంశాలు వారీగా విమర్శించిన ప్రధాని మోడీకి తాము కూడా ఎక్కడా తగ్గమని జవాబు ఇచ్చిన బరాస వైఖరి చర్చనీయాంశం గా మారింది.