పవన్ బలంపై గురి పెడ్తున్న వైసిపి?

తన రాజకీయ ప్రయాణానికి అనుకూలమైన నియోజకవర్గాలుగా పవన్ భావిస్తున్నఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న 34 స్థానాలలో మెజారిటీ స్థానాలను పొత్తులో భాగంగా సాధించుకోవాలని, అందులో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను గెలవాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) దానికోసం తన శక్తి యుక్తులు మొత్తం కేంద్రీకరిస్తున్నారు.తనకున్న పరిమిత వనరులతో రాష్ట్ర వ్యాప్త ప్రయత్నం చేయటం అంత తెలివైన నిర్ణయం కాదని గ్రహించిన పవన్, తన బలం ఉన్నచోట్ల మరింత బలం పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు .

 Ycp New Game Plan Againest Janasena , Janasena, Ycp , Pawan Kalyan, Mudragada,-TeluguStop.com

ఇది వ్యూహాత్మకంగా తెలివైన ఎత్తుగడగా చెప్పవచ్చు.అయితే దీనిని ఎదుర్కోవడానికి ఇప్పటివరకు అధికార వైసీపీ( YCP ) నుంచి సరైన వ్యూహం అయితే కనిపించలేదు.

ముద్రగడని( mudragada ) ప్రయోగించి తూర్పుగోదావరి జిల్లాలలో పవన్ సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ కి అనుకూలంగానే మెజారిటీ సామాజిక వర్గం స్పందించడంతో ఆ ప్రయత్నం అంత సఫలం అవ్వలేదని చెప్పవచ్చు.

Telugu Janasena, Mudragada, Pawan Kalyan, Varahi Yatra, Ycpgame-Telugu Political

దాంతో మొదటి దశ వారాహి యాత్ర( Varahi Yatra ) సూపర్ సక్సెస్ అవడం అధికార పార్టీకి కొంత ఇబ్బందికర వాతావరణంగానే చూడాలి.అయితే ఇప్పటికైనా పవన్ని అడ్డుకునే వ్యూహాన్ని అమలు చేయకపోతే వచ్చే ఎన్నికలలో ఇబ్బంది అవుతుంది గ్రహించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

Telugu Janasena, Mudragada, Pawan Kalyan, Varahi Yatra, Ycpgame-Telugu Political

ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో( Rayalaseema areas ) పవన్ @ 34 అంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు అంటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి .తద్వారా పవన్ ను ఒక స్థానిక నేతగా ప్రొజెక్ట్ చేయాలన్న ప్రయత్నం అధికార వైసిపి నుంచి కనిపిస్తుంది.పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయలేడని ,అతనికి అంత స్టామినా లేదని రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం కూడా ఆయనకు లేదని, రాష్ట్రస్థాయి నేతగా పవన్ ని చూడకూడదనే సంకేతాలను ఇచ్చే విధంగా ప్రచారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇది ఒక రకం గా పవన్ పై ఇంపాక్ట్ చూపించే విమర్శ గానే చూడాలి .ఇది పవన్ కళ్యాణ్ పై సూటిగా తగిలే అవకాశం కనిపిస్తుంది.దీనిపై మీడియాలో కూడా భారీ స్థాయిలో చర్చ చేసేందుకు పధక రచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది.మరి వ్యూహాన్ని జనసేన ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube