బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.అప్పటి నుండి ఈయన అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ విధంగా దూసుకు పోతున్నాడు.
అయితే పాన్ ఇండియా సినిమాలు చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు.ఒక్కో సినిమాకు చాలా వర్క్ ప్రెజర్ ఉంటుంది.
కానీ ప్రభాస్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలు సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.
దీంతో ఈయన ఎప్పుడు షూటింగ్ లో బిజీగా ఉంటూ సెట్స్ లోనే ఎక్కువుగా గడుపుతున్నాడు.
ఎల్లప్పుడూ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ తీసుకోకుండా షూట్ లలోనే గడుపు తుండడంతో ఈయనకు వర్క్ ప్రెజెర్ ఎక్కువ అయ్యింది.అసలు పెళ్లి అనే మాట కూడా ఎత్తకుండా సినిమాలతోనే జీవనం సాగిస్తున్నాడు.
ఈయన పెళ్లి కోసం ఆయన అభిమానులు అంతా వెయిట్ చేస్తున్నారు.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నారు.
ఇన్నేళ్లు గడుస్తున్న ఈయన పెళ్లి మాట ఎత్తకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే కొనసాగుతున్నాడు.అయితే ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని.
అందుకే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలపై ప్రభాస్ పెద్దమ్మ స్పందించింది.
![Telugu Krishnam Raju, Krishnamraju, Prabhas, Shyamala Devi-Movie Telugu Krishnam Raju, Krishnamraju, Prabhas, Shyamala Devi-Movie]( https://telugustop.com/wp-content/uploads/2022/03/Krishnam-Raju-Wife-Shyamala-Devi.jpg)
కృష్ణం రాజు భార్య శ్యామల దేవి గారు ప్రభాస్, అనుష్క లపై వస్తున్న రూమర్స్ ను కొట్టి పారేసాడు.అలాగే ప్రభాస్ పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చేసారు.ఆయన మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తాడని తప్పకుండ పెళ్లి చేసుకుంటాడని చెప్పుకొచ్చారు.ఈమె ఇలా చెప్పడంతో అభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ అసలు పెళ్లి చేసుకోడేమో అని భయపడిన ఫ్యాన్స్ కు ఈమె చెప్పిన వార్తతో క్లారిటీ వచ్చేసింది.