1973.అప్పుడప్పుడే తెలుగు సినిమా పరిశ్రమ మంచి సినిమాలతో ముందుకు వెళ్తోంది.సినిమా జనాలకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది.వారిని జనాలు అద్భుత వ్యక్తులుగా భావించే వారు.ఆ రోజుల్లో సినిమా అవకాశాలు అంతగా వచ్చేవి కాదు కూడా.ఫోటోలను పట్టుకుని చెప్పులు అరిగేలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగితేనే వచ్చేవి.
అలా తిరిగి తిరిగి జీవితాలు కోల్పోయిన ఎంతో మంది ఉన్నారు కూడా.అలాంటి వారిలో మురళీ మోహన్ ఒకడు.
సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన అవకాశాలు వస్తాయనే నమ్మకం తనకు లేదు.అందుకే సినిమా ప్రయత్నాలు చేయలేదు.
కానీ నటుడు కావాలని మనసులో ఉండిపోయింది.ఆయనకు సూపర్ స్టార్ క్రిష్ణ మంచి మిత్రుడు.
ఇద్దరూ కలిసి చదువుకున్నారు.ఒకరంటే మరొకరికి మంచి గౌరవం.
కానీ క్రిష్ణ సాయంతో నటుడిగా ఎదగడం మరళీకి ఇష్టం లేదు.
అదే సమయంలో జగమే మాయ అనే సినిమా కోసం కొత్త నటీనటులను వెతుకుతున్నారు అని తెలిసి మురళీ మోహన్ తన ఫోటోలను పంపించాడు.
మీరే మా హీరో.మద్రాసుకు రండి అని ఉత్తరం వచ్చింది.
అలా తనకు తొలి అవకాశం దక్కింది.మధ్య మధ్యలో క్రిష్ణ కలిసినా ఈ సినిమా గురించి తను మాత్రం చెప్పలేదు.
అలా క్రిష్ణకు మురళీ మోహన్ హీరోగా నటించాడు అనే విషయం తెలియదు.ఆ తర్వాత దాసరి నారాయణరావు క్రిష్ణతో కలిసి రాధమ్మ పెళ్లి అనే సినిమా చేస్తున్నాడు.
మద్రాసులో షూటింగ్ జరుగుతుంది.అందులో ఓ గెస్ట్ రోల్ ఉంది.
దానికి మురళీ మోహన్ అయితే బాగుటుంది అనుకున్నాడు.వెంటనే తనను పిలిపించాడు.
సెట్ కి వచ్చిన మురళీ మోహన్ తన కోసమే వచ్చాడు అనుకోని..
పక్కన కూర్చో వస్తున్నా అని చెప్పాడు.అంతలో దాసరి వచ్చి మురళీ మోహన్ కు మేకప్ వేయించి స్పాట్ కు తీసుకొచ్చాడు.
తనకు ఎదురుగా మేకప్ తో ఉన్న మురళీ మోహన్ ను చూసి.నువ్వేంటి మేకప్ తో వచ్చావ్? అంటూ ఆశ్చర్యపోయాడు క్రిష్ణ.మురళీ మోహన్ నవ్వుతూ.నేను సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను క్రిష్ణా అని చెప్పాడు.
మరి నాకు ఇంత కాలం ఎందుకు చెప్పలేదు? నన్ను అవకాశం కోసం ఎందుకు అడగలేదు? అంటూ ప్రశ్నించాడు.మొత్తంగా మురళీ తన ఫ్రెండ్ అని దాసరికి పరిచయం చేశాడు క్రిష్ణ.