తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సర్కార్ గొల్ల, కురుమల అకౌంట్లలో డబ్బులు వేసి వాటిని ఫ్రీజ్ చేసిందని మండిపడ్డారు.
ఫ్రీజ్ చేయడం వలన సొంత డబ్బు కూడా వాడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.అకౌంట్లలో వేసిన డబ్బు తిరిగి తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి గొల్ల కురుమ అకౌంట్లపై ఫ్రీజ్ ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.