మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మీడియా సమావేశం.గత మూడు సంవత్సరాలుగా స్టేట్మెంట్ లకే పరిమితమైన బందరు పోర్టు…గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పటివరకు ఒక అంగుళం ముందుకు సాగని బందర్ పోర్ట్ పనులు.
గత ప్రభుత్వంలో వీళ్ళు అనేక ఇబ్బందులు పెట్టిన భూములు విషయంలో గానీ రైతులకు డబ్బులు చెల్లించే విషయంలో గానీ నవయుగ సంస్థతో పనులు మొదలుపెట్టించడం సమర్థవంతంగా చేయగలిగాం.గత ప్రభుత్వంలో మేము మొదటి పేజీలో 12 జెట్లీలు పెట్టాం ఇప్పుడు మీరు 6 జెట్లీలు పెట్టాం అంటున్నారు.
రాష్ట్రం మొత్తం మెగా రెడ్డి చేతుల్లోనే పెట్టారు.బందర్ పాటు కూడా మెగా రెడ్డి చేతుల్లోనే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటి వరకు బందరు పోర్టు మీద ఒక సరైన సమాచారం చెప్పడం లేదు.రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక చెంచాడు మట్టి గాని ఒక గుంత పొడిచడం గాని చేశారా.
రోడ్డు కాం రైల్వే రోడ్డుకు MUDA ద్వారా 100 కోట్లు ఇమ్మంటే దిక్కులేదు గాని ఇప్పుడు 4000 కోట్ల రూపాయలు తెస్తామని వాగ్దానాలు దాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ముఖ్య మంత్రి పెడనలో ఏవో ఆత్మలు చెప్పినట్టు ఇప్పుడే అందిన శుభవార్త 15 రోజుల్లో పోర్ట్ పనులు పూర్తి చేస్తామని మాయమాటలు చెప్పడం.హాస్పిటల్స్ లో కనీసం మౌలిక సౌకర్యాలు కూడా కల్పించడం లేదు.
హాస్పిటల్ లో కనీసం డబ్బు కూడా ఏర్పాటు చేయకుండా కిటికీ లకే సెలైన్ బాటిల్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి.గత ప్రభుత్వంలో దాదాపు 5 కోట్ల రూపాయలు విలువచేసే ఎంఆర్ఐ స్కానింగ్ పెట్టిస్తే దాన్ని సరిగా వాడక తుప్పుపట్టే విధంగా తయారు చేశారు.
కనీసం ఒక రూపాయి ఖరీదు చేసే పారాసిటిమిల్ టాబ్లెట్స్ కూడా లేకుండా హాస్పిటల్ నడుపుతుంది ఈ ప్రభుత్వం…కనీసం చనిపోయిన డేడ్ బాడీలను తీసుకెళ్లడానికి కూడా అంబులెన్స్ లేకుండా వుండే పరిస్థితి.ఒకప్పుడు కార్తీక మాసం పౌర్ణమి సమయంలో లక్షల్లో వచ్చే సందర్శికులు ఈ ప్రభుత్వం చేస్తున్న చేష్టల వలన కనీసం 200 మంది కూడా రాని పరిస్థితి.
నిన్న మంగినపూడి బీచ్ లో అధికారుల నిర్లక్ష్యం వల్ల 14 సంవత్సరాల కుర్రోడు చనిపోయిన బాడీ నీ అంబులెన్స్ లేక బండిపై తీసుకు వెళ్లాల్సి వచ్చింది.ప్రజలు సముద్ర స్థానాలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారు.