కే‌సి‌ఆర్ కు ఖమ్మం స్ట్రోక్.. తగలనుందా ?

అధికార బి‌ఆర్‌ఎస్( Khammam BRS ) కు ఖమ్మంలో ఎఫెక్ట్ తప్పదా ? ఖమ్మంలో కే‌సి‌ఆర్ అంచనాలన్నీ తారుమారవుతున్నాయా ? ప్రస్తుతం ఖమ్మంలో రాజకీయ పరిస్థితులు( Khammam Politics ) ఎలా ఉన్నాయి ? ప్రస్తుతం ఈ ప్రశ్నలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అన్నీ స్థానాలను కైవసం చేసుకోవాలని మొదటి నుంచి కే‌సి‌ఆర్ గట్టి పట్టుదలగా ఉన్నారు.

 Khammam Politics Shock Brs Kcr,khammam,khammam Politics,cm Kcr,brs,congress,kand-TeluguStop.com

ఎందుకంటే గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బి‌ఆర్‌ఎస్ కు ఆశించినంతగా ఫలితాలు రాలేదు.కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఈ జిల్లాల్లో కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం కూడా ఉంది.

Telugu Brs, Cm Kcr, Congress, Kandalaupender, Khammam, Khammamshock-Politics

అందుకే ఈ సారి ఎలాగైనా కాంగ్రెస్( Congress ) మరియు ఇతర పార్టీలకు చెక్ పెట్టి ఏకంగా పది స్థానాలను సొంతం చేసుకోవాలని గులాబీ బాస్ ప్లాన్ చేశారు.అయితే ఆయన ప్రణాళికలు బెడిసికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో బలమైన నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) బి‌ఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో ఒక్క సీటును కూడా బి‌ఆర్‌ఎస్ కు దక్కనివ్వనని శపథం చేస్తున్నారు.ఇక జిల్లాలో మరో ప్రధాన నేత అయిన తుమ్మల నాగేశ్వరరావ్ కూడా బి‌ఆర్‌ఎస్ వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Telugu Brs, Cm Kcr, Congress, Kandalaupender, Khammam, Khammamshock-Politics

గత నెల 21న ప్రకటించిన మొదటి జాబితాలో తుమ్మల( Tummala Nageswara Rao ) పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.పాలేరు సీటు తుమ్మల ఆశించగా.ఆ స్థానాన్ని అనూహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి( Kandala Upender Reddy )కే కట్టబెట్టారు కే‌సి‌ఆర్.దాంతో ఆయన హస్తం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు.

తుమ్మల కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.ఇటీవల కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారాయన.

దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని బలమైన నేతలంతా ఇతర పార్టీల గూటికి చేరుతుండడంతో జిల్లాలో పది స్థానాలు సొంతం చేసుకోవాలని ఆశిస్తున్న కే‌సి‌ఆర్ ఆశలు ఫలించడం కష్టమే అంటున్నారు కొందరు విశ్లేషకులు.అయితే ఖమ్మంలో పార్టీకి మైలేజ్ తీసుకు రావడానికి తాజాగా కొందరికి ఇంచార్జ్ పదవులు కట్టబెట్టారు కే‌సి‌ఆర్.

మరి తాజా పరిణామాల దృష్ట్యా గులాబీ బాస్ కు ఉమ్మండి ఖమ్మం జిల్లాల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube