ఆ మాట విని క్లాస్ లో అందరూ నవ్వేవాళ్లు.. కేజీఎఫ్ హీరో షాకింగ్ కామెంట్స్ వైరల్!

కేజీఎఫ్ ఛాప్టర్ 1 సినిమాతో ఓవర్ నైట్ లో యశ్ ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.ఈ సినిమా సక్సెస్ వల్ల యశ్ కు హీరోగా వరుస ఆఫర్లు వస్తున్నాయి.

 Kgf Hero Childhood Memories Goes Viral In Social Media Details, Yash, Kgf Hero,-TeluguStop.com

మరికొన్ని రోజుల్లో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా విడుదల కానుంది.కేజీఎఫ్ ఛాప్టర్1 కు కొనసాగింపుగా కేజీఎఫ్ ఛాప్టర్2 తెరకెక్కుతోంది.

ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ తాను హసన్ లో జన్మించానని తన తండ్రి బస్ డ్రైవర్ అని అన్నారు.

బాల్యం నుంచి తనకు సినిమాలు అంటే ఇష్టమని సినిమా ఇండస్ట్రీలో ఎలాగైనా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తాను అనుకున్నానని యశ్ పేర్కొన్నారు.

క్లాస్ లో టీచర్ పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే అందరూ డాక్టర్, ఇంజనీర్ అని చెప్పేవారని అయితే తాను మాత్రం హీరో కావాలని అనుకుంటున్నానని చెప్పేవాడినని యశ్ పేర్కొన్నారు.తాను అలా చెప్పడం వల్ల క్లాస్ లో అందరూ నవ్వేవారని యశ్ అన్నారు.

అందరూ నవ్వుతున్నా తాను మాత్రం మనసులో ఏదో ఒకరోజు హీరో అవుతానని అనుకునేవాడినని యశ్ తెలిపారు.

Telugu Childhood, Prasanth Neel, Yash, Yash Interview, Kgf, Kgf Chapter, Yash Ch

బెంగళూరులో తాను బ్యాక్ స్టేజ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశానని కొన్నేళ్లు కష్టపడి సినిమా రంగంలోకి వచ్చానని యశ్ పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ విధంగా ప్రేక్షకుల ప్రశంసలను పొందుతున్నానని యశ్ కామెంట్లు చేశారు.కేజీఎఫ్ 2 సినిమాతో యశ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

Telugu Childhood, Prasanth Neel, Yash, Yash Interview, Kgf, Kgf Chapter, Yash Ch

కేజీఎఫ్2 సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు ఏకంగా 550 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.ఈ సినిమాకు ఆ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.కేజీఎఫ్2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.యశ్, ప్రశాంత్ నీల్ లకు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube