తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి వరుసగా రెండుసార్లు రాష్టంలో అధికారం చేపట్టిన బిఆర్‌ఎస్ పార్టీని( BRS party ) అనూహ్యంగా 2023 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు.మొదటి నుంచి బిఆర్‌ఎస్ విజయంపై ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన కేసిఆర్ కు ఈ ఘోర పరాభవం ఏ మాత్రం మింగుడు పడని విషయమే.
అయితే బిఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణం కేసిఆర్ వ్యూహ రచన ప్రభావమే అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.సాధారణంగా ప్రత్యర్థి పార్టీల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే గులాబీ బాస్ ఈసారి మాత్రం లైట్ తీసుకొని పొరపాటు చేశారనేది కొందరి అభిప్రాయం.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి, ధరణి భూ కబ్జాలు, కుటుంబ పాలన.వంటి వాటిని ప్రధాన విమర్శనస్త్రాలుగా ప్రత్యర్థి పార్టీలు సంధిస్తూ వచ్చాయి.

కానీ ఈ విమర్శలను తిప్పికొట్టడంలో కేసిఆర్ విఫలం అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.పైగా కాంగ్రెస్ పార్టీని కేసిఆరే హైలెట్ చేస్తూ వచ్చారనేది మరికొందరి వాదన.అంతకు ముందు బిజేపీని విమర్శిస్తూ వచ్చిన కేసిఆర్.ఒక్కసారిగా బిజేపీ విషయంలో నెమ్మదించి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూవచ్చారు.కాంగ్రెస్ ” స్కాంగ్రెస్ ” అని కాంగ్రెస్( Congress ) వస్తే కరెంట్ కోతలే అని ఇలా హస్తం పార్టీ టార్గెట్ గానే విమర్శలు చేశారు కేసిఆర్.దీంతో అసలు రేస్ లోనే లేని హస్తంపార్టీ అనూహ్యంగా ముందుకొచ్చింది.
పైగా కేసిఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేయడంతో బిజేపీ బిఆర్‌ఎస్ మద్య లోపాయికారి ఒప్పందం ఉందనే టాక్ బలపడుతూ వచ్చింది.దీంతో ప్రజల దృష్టి కాంగ్రెస్ వైపు తిరిగిందనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.

ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కూడా కేసిఆర్ ( KCR )సిట్టింగ్ లకే అధిక స్థానాలు కట్టబెట్టి తప్పు చేశారనే టాక్ కూడా వినిపిస్తుంది.ఎందుకంటే 30 మందికి పైగా ఎమ్మేల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, తీరు మార్చుకోవాలని ఓ సందర్భంలో వార్నింగ్ ఇచ్చిన కేసిఆర్ మళ్ళీ సిట్టింగ్ లకే అధిక సీట్లు కేటాయించడం కూడా పెద్ద మైనస్.ఇక పోతే ఎన్నికల ప్రచారంలో కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ప్రభావం చూపయనేది కొందరి వాదన.బిఆర్‌ఎస్ ఓడిపోతే తమకేమి నష్టం లేదని ప్రజలకే నష్టం అని, కాంగ్రెస్ కు అధికారం ఇవ్వొద్దని.
ఇలా వ్యాఖ్యానిస్తూ వచ్చారు కేసిఆర్.దీంతో కేసిఆర్ ఓటమిని ముందే ఒప్పుకున్నారనే టాక్ కూడా బలపడుతూవచ్చింది.
ఈ పరిణామాలన్ని బిఆర్‌ఎస్ కు ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు.