తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పటి నుంచి రాజకీయ పార్టీల మద్య ఎలక్షన్ హీట్ తారస్థాయికి చేరుకోనుంది.అందరూ బావించినట్లుగానే నవంబర్ లోనే ఎన్నికలు జరగనున్నాయని తెలియడంతో ఈ రెండు నెలల్లో పక్కా వ్యూహాలను అమలు చేసేందుకు ప్రధాన పార్టీలు సిద్దమౌతున్నాయి, ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్ పార్టీ ( BRS )అభ్యర్థులను ప్రకటించి అందరి కంటే ముందే ఎలక్షన్ వార్ లో ముందడుగు వేసింది.
ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు( Congress BJP parties ) కూడా ఈ రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి.

ఇక మిగిలింది ఎన్నికల ప్రచారమే.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ( CM kcr )కోలుకోవడంతో ఎలక్షన్ క్యాంపైన్ రూట్ మ్యాచ్ సిద్దం చేసింది అధికార పార్టీ.ఈ నెల 15న హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేందుకు కేసిఆర్ సిద్దమౌతున్నారు.
పక్కా ప్రణాళిక బద్దంగా అన్నీ నియోజిక వర్గాలను పర్యటించేలా కేసిఆర్ రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు.ఇక అటువైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికపైనే మల్లగుల్లాలు పడుతున్నాయి.
రాబోయే రెండు రోజుల్లో ఆ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నప్పటికి.వాటిపై ఇంకా పూర్తి స్పష్టత లేదు.

దాంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ( Congress BJP parties )ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించాలి ? ఎప్పుడు ప్రచారం స్టార్ట్ చేయాలి ? అనే ప్రశ్నలు ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమౌతున్నాయట.ఒకవైపు బిఆర్‌ఎస్ దూసుకుపోతుంటే.ప్రధాన ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న బీజేపీ కాంగ్రెస్ లు ఇలా వెనకబడడం ఆ పార్టీలోని లొసుగులను బయటపెడుతోందనేది కొందరి అభిప్రాయం.ఈ రెండు పార్టీల నుంచి బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపైనే అగ్రనేతల దృష్టి నెలకొంది మరి అభ్యర్థులను ప్రకటించి.
ప్రచారంలోకి అడుగుపెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది.మరి ఎలక్షన్ క్యాంపైన్ లోకి ఈ రెండు పార్టీలు ఎప్పుడు అడుగు పెడతాయో చూడాలి.