కౌన్ బనేగా కరోడ్ పతిలో రూ.కోటి గెలుచుకున్న 14 ఏళ్ల బాలుడు.. ఆ ప్రశ్న ఏంటంటే?

కౌన్ బనేగా కరోడ్ పతి( Kaun Banega Crorepati ) ప్రోగ్రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ ప్రోగ్రామ్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో పాటు మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటోంది.

 Kbc Gets Its Youngest Crorepati Ever As 14 Year Old Mayank Details, Mayank, Kbc-TeluguStop.com

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్( Amitabh Bachchan ) ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఈ షోలో 14 సంవత్సరాల బాలుడు సంచలనం సృష్టించి వార్తల్లో నిలిచారు.ఈ బాలుడు ఏకంగా కోటి రూపాయలు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

కేబీసీ జూనియర్స్ స్పెషల్ లో( KBC Juniors Special ) భాగంగా హరియాణాలోని మహేంద్ర గఢ్ కు చెందిన మయాంక్( Mayank ) మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో కోటి రూపాయలను సొంతం చేసుకున్నారు.కోటి రూపాయలు గెలుచుకున్న బాలుడిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.3.2 లక్షల రూపాయల వరకు మయాంక్ ఒక్క లైఫ్ లైన్ ను కూడా ఉపయోగించుకోకపోవడం గమనార్హం.కోటి రూపాయల ప్రశ్నకు జవాబు చెప్పిన తర్వాత మయాంక్ ఎమోషనల్ అయ్యారు.

మయాంక్ ఎమోషనల్ కావడంతో ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగిల్చింది.కొత్తగా కనుగొన్న ఖండానికి అమెరికా( America ) అని పేరు పెట్టి దాని మ్యాప్ ను తయారు చేసిన యూరోపియన్ క్యాటోగ్రాఫర్ ఎవరు? అనే ప్రశ్నకు అబ్రహాం ఒర్టెలియస్, గెరాడస్ మెరేక్టర్, జియోవన్నీ బాటిస్టా అగ్నెస్, మార్టిన్ వాల్డీ ముల్లర్ అనే ఆప్షన్లు ఇవ్వగా మార్టిన్ వాల్డీ ముల్లర్ అనే ఆప్షన్ ను ఎంచుకుని మయాంక్ కోటి రూపాయలు గెలుచుకున్నారు.

7 కోట్ల రూపాయల ప్రశ్న తర్వాత వేర్వేరు కారణాల వల్ల మయాంక్ షో నుంచి క్విట్ కావడం జరిగింది.కేబీసీలో( KBC ) పాల్గొనడం తన లక్ అని అందునా అమితాబ్ సర్ కు ఎదురుగా కూర్చొని సమాధానాలు చెప్పడం ఆనందంగా ఉందని మయాంక్ అన్నారు.మయాంక్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube