ప్రాణాపాయ స్దితిలో కత్తి మహేశ్.. !

టాలీవుడ్ ఇండ్రస్ట్రీలో పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రముఖ సినీ సమీక్షకుడు, నటుడు కత్తి మహేశ్ ప్రాణాలు అపాయంలో పడ్డాయట.ఇకపోతే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసి ఒక్క సారిగా వెలుగులోకి వచ్చిన కత్తి జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 ద్వారా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ అందుకున్నారు.

 Kathi Mahesh Health Condition Critical, Kathi Mahesh, Health Condition, Critical-TeluguStop.com

అంతేకాకుండా పలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులను అలరించే వారు.

ఇకపోతే ఈరోజు ఉదయం కత్తి ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై ప్రమాదానికి గురవగా ఈ ప్రమాదంలో ఆ వాహనం ముందు భాగం తీవ్రంగా ధ్వంసం అయ్యిందట.

అంతే కాదు కత్తి మహేష్‌ కళ్లు, దవడలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించిన ఫలితం లేకుండా పోయిందట.కాగా కత్తి మహేశ్ పరిస్దితి అయోమయంగా ఉందని 24గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు వెల్లడించారట.

కాగా ఇతనికి మెరుగైన చికిత్స అందించడం కోసం చెన్నై తరలిస్తున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube