పుణ్యానికి పుణ్యం, ఆటవిడుపు: లాక్‌డౌన్‌ను ఎలా వాడుకోవాలో చూపిస్తున్న ఎన్ఆర్ఐ జంట

కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు.ఉరుకులు పరుగుల జీవితంలో కాస్త విశ్రాంతి దొరకడంతో బిజీగా ఉండే ఎంతోమంది లాక్‌డౌన్ సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు వినియోగిస్తున్నారు.

 Nri Couple Put Lockdown Vacay To Good Use In Karnataka,abudhabi, Watsapp Group,k-TeluguStop.com

అయితే ఇంట్లో కంటే బయటే గడిపేందుకు ఇష్టపడే కొందరికి మాత్రం లాక్‌డౌన్ నరకంలా మారింది.ఈ క్రమంలో ఓ ఎన్ఆర్ఐ జంట ఈ సమయాన్ని ఎలా వుపయోగించుకోవాలో ఆచరించి చూపిస్తోంది.
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన బర్కీ గాయత్రీ ప్రకాశ్, చంద్ర ప్రకాశ్ జంట మార్చి 17వ తేదీన అబుధాబీ నుంచి భారత్‌కు వచ్చారు.వారు వచ్చిన కొద్దిరోజులకే దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది.

దీంతో వారు తిరిగి అబుదాబీకి వెళ్లే వీలు లేకపోవడంతో బెంగళూరులోనే వుండాల్సి వచ్చింది.ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించి పలు రకాలు ఆలోచించారు భార్యాభర్తలు.

దీనిలో భాగంగా లాక్‌డౌన్ కారణంగా పూట గడవటం కూడా కష్టంగా ఉన్న పేదలను ఆదుకోవాలని, వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని భావించింది.

Telugu Abudhabi, Karnataka, Lockdown, Nriput, Watsapp-

అయితే అది అనుకున్నంత తేలిక కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్న పని.ఏం చేయాలా అని స్నేహితులతో చర్చించి వాట్సాప్‌ గ్రూప్‌ను ఓపెన్ చేశారు.భారత్‌తో పాటు దేశవిదేశాల్లో ఉన్న బంధు మిత్రులు, తెలిసిన వారిని దీనిలో చేర్చి.

తాము చేయాలనుకుంటున్న విషయం తెలియజేశారు.వీరి పిలుపుతో 118 మంది వాట్సాప్ గ్రూప్‌లో చేరగా.వీరి నుంచి తొలి వారంలో రూ.5 లక్షలను సేకరించారు.ఆ డబ్బుతో బెంగళూరు నగరంలో ఆర్ధికంగా కష్టాలు పడుతున్న 3,500 మందికి నిత్యావసర సరకులను అందజేశారు.అలాగే కరోనాపై యుద్ధంలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కూడా చంద్రప్రకాశ్ జంట సరుకులను అందజేసింది.

అంతేకాకుండా వృద్ధాశ్రమాల్లోని 15 మందికి డయాలసిస్ చికిత్స కూడా చేయించినట్లు ఈ జంట చెప్పింది.

తమకు ఇప్పటివరకు రూ.15 లక్షల విరాళం వచ్చిందని.ఈ సహాయాన్ని లాక్‌డౌన్ ముగిసే వరకు ఇలాగే సహాయక చర్యలు కొనసాగిస్తామని చంద్రప్రకాశ్ దంపతులు పేర్కొన్నారు.

ప్రతిరోజు తాము ఖర్చు చేసిన డబ్బు, నిత్యావసరాలు అందజేసిన వివరాలను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తూ.సాహయాన్ని కూడా పారదర్శకంగా ఉంచుతూ ఈ జంట పలువురి ప్రశంసలు పొందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube