అవును, మీరు విన్నది నిజమే.కర్నాటకలోని హుబ్బళ్లి రైల్వే స్టేషన్( Hubballi Railway Station ) ఓ అరుదైన రికార్డును నమోదు చేయడం యావత్ ఇండియాకి గర్వకారణం అని చెప్పుకోవచ్చు.
యావత్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌గా( World Longest Railway Platform ) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరడం విశేషం.ఇప్పటి వరకు ఈ రికార్డు ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ పేరుపై నమోదై ఉండగా ఇప్పుడు అది కాస్త హుబ్బళ్లి రైల్వేస్టేషన్ పేరిట నమోదు కావడం కొసమెరుపు.
అవును, గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ 1,366 మీటర్ల పొడవైన ప్లాట్ ఫామ్ ను కలిగి ఉండగా ఆ రికార్డును హుబ్బళ్లి రైల్వేస్టేషన్ అధిగమించింది.దానికి కారణం ఒకటుంది.ఇటీవల ఇక్కడ 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్ ను నిర్మించారు.ఇది గత ఆదివారం అధికారికంగా ప్రారంభం కావడంతో జనవరి 12న ప్లాట్‌ఫారమ్ పొడవును ధృవీకరించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్( Guinness World Record ) తెలిపింది.
ప్రపంచంలోనే అతి పొడవైన ఈ రైల్వే ప్లాట్ ఫామ్ ను శ్రీ సిద్ధరూద స్వామీజీ హుబ్బళ్లి స్టేషన్‌గా ఇపుడు పిలుస్తున్నారు.సుమారు రూ.20 కోట్ల వ్యయంతో 1507 మీటర్ల పొడవులో ప్లాట్ ఫాంను నిర్మించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గతంలో ఈ స్టేషన్ కు 2 ఎంట్రెన్స్, 2 ఎగ్జిట్ ద్వారాలు ఉండేవి.అంటే ఈ ప్లాట్‌ఫారమ్ లో ఒకేసారి 2 దిక్కుల నుంచి 2 రైళ్లు రాకపోకలు సాగించవచ్చన్నమాట.ఈ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడం కోసం హోసపేట -హుబ్బల్లి – తినైఘాట్ సెక్షన్ విద్యుదీకరణ, హోసపేట స్టేషన్‌ను అప్‌గ్రేడేషన్‌ను కూడా ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించడం జరిగింది.530 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయబడిన ఈ విద్యుదీకరణ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌పై అతుకులు లేని రైలు ఆపరేషన్‌ను ఏర్పాటు చేస్తుంది.పునరాభివృద్ధి చేయబడిన హోసపేట స్టేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన మరియు ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది.